VE కమర్షియల్ వెహికల్స్ యొక్క విభాగం అయిన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దాని ఎలక్ట్రిక్-ఫస్ట్ శ్రేణి స్మాల్ కమర్షియల్ వెహికల్స్ (SCVలు) అయిన ఐషర్ ప్రో X శ్రేణిని విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ విప్లవాత్మక శ్రేణి వేగంగా అభివృద్ధి చెందుతున్న 2-3.5T విభాగంలోకి ఐషర్ యొక్క వ్యూహాత్మక ప్రవేశాన్ని సూచిస్తుంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో VE కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, "లైట్ మరియు మీడియం డ్యూటీ ట్రక్కులలో మా మార్కెట్ నాయకత్వ వారసత్వాన్ని , మా ట్రాక్ రికార్డ్‌ను ఉపయోగించి ఈ అత్యుత్తమ శ్రేణి వాహనాలను సృష్టించాము. ఇది ఐషర్ బ్రాండ్ ఫిలాసఫీ , 'నయీ సోచ్, నయీ రాస్తే' యొక్క స్వరూపం. భారతదేశం తన 'వికసిత్ భారత్' ప్రయాణంలో ముందుకు సాగుతున్న వేళ, SCV విభాగం కీలక పాత్ర పోషించనుంది మరియు చివరి మైలు లాజిస్టిక్స్‌లో పరివర్తనను ఐషర్ ప్రో X నడిపిస్తుంది" అని అన్నారు.
ఐషర్ ప్రో X శ్రేణి పరిశ్రమలో అత్యుత్తమ ఫీచర్ల తో వస్తుంది, వాటిలో 2-3.5T GVW శ్రేణి విభాగంలో అతిపెద్ద కార్గో లోడింగ్ సామర్ధ్యం, మెరుగైన రీతిలో ఒక్క ఛార్జింగ్ తో అత్యుత్తమ మైలేజీ, ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు వంటివి వున్నాయి.
ఐషర్ యొక్క ఇండస్ట్రీ 4.0-ఆధారిత భోపాల్ ప్లాంట్‌లో తయారు చేయబడిన ఐషర్ ప్రో X సిరీస్ 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఐషర్ ప్రో X పూర్తిగా మహిళల అసెంబ్లీ లైన్‌లో అసెంబుల్ చేయబడింది.
"ఐషర్ ప్రో X శ్రేణిని ప్రముఖ లాజిస్టిక్స్ ప్లేయర్లు మరియు డ్రైవర్లతో కలిసి రూపొందించారు. ఇ-కామర్స్, FMCG, పార్శిల్ & కొరియర్ మరియు కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ వంటి అప్లికేషన్ల శక్తివంతమైన డిమాండ్లను తీర్చడానికి జాగ్రత్తగా రూపొందించారు అని VE కమర్షియల్ వెహికల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఎస్ ఎస్ గిల్ అన్నారు.