అతిపెద్ద క్రీడా సీజన్‌తో క్రీడా పర్యాటకానికి ప్రపంచ కేంద్రంగా మారుతున్న దుబాయ్
2025 నుండి మార్చి 2026 వరకు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్‌లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ క్యాలెండర్‌తో దుబాయ్ ప్రపంచ క్రీడా వేదికగా మారుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
2025 నుండి మార్చి 2026 వరకు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్‌లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ క్యాలెండర్‌తో దుబాయ్ ప్రపంచ క్రీడా వేదికగా మారుతోంది. 17వ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్, పురుషుల రగ్బీ ప్రపంచ కప్ 2027 ఫైనల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌ను నిర్వహించడం నుండి, నగరం యొక్క స్వంత యూరోలీగ్ బాస్కెట్‌బాల్ ఫ్రాంచైజీ, తొలి బేస్‌బాల్ యునైటెడ్ సీజన్‌ను స్వాగతించడం వరకు, దుబాయ్ క్రీడా పర్యాటకం, అంతర్జాతీయ పోటీలకు ప్రపంచ కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉంది.
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా మ్యాచ్‌లలో కొన్నింటిని దుబాయ్ స్వాగతిస్తుంది వీటిలో … ఆసియా కప్ క్రికెట్ (9–28 సెప్టెంబర్ 2025) ఒకటి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక మరియు యుఎఈ సహా ఎనిమిది దేశాలు పోటీపడబోతున్నాయి. అలాగే దుబాయ్ బాస్కెట్‌బాల్ (సెప్టెంబర్ 2025 – మే 2026), పురుషుల రగ్బీ ప్రపంచ కప్ 2027 ఫైనల్ క్వాలిఫికేషన్ (8–18 నవంబర్ 2025) , బేస్‌బాల్ యునైటెడ్ (14 నవంబర్ - 14 డిసెంబర్ 2025): దుబాయ్ ప్రీమియర్ పాడెల్ P1 (9–16 నవంబర్ 2025), దుబాయ్ రేసింగ్ కార్నివాల్ (7 నవంబర్ 2025 – 28 మార్చి 2026), డిపి వరల్డ్ టూర్ ఛాంపియన్‌షిప్ (13–16 నవంబర్ 2025), ఎమిరేట్స్ దుబాయ్ 7s (28–30 నవంబర్ 2025), దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లు (15–28 ఫిబ్రవరి 2026), హీరో దుబాయ్ డెసర్ట్ క్లాసిక్ (జనవరి 2026) జరుగుతాయి. ఇవిగాక కమ్యూనిటీ ఫిట్‌నెస్ మరియు పార్టిసిపేషన్ కార్యక్రమాలలో దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ (1–30 నవంబర్ 2025), ఎడారి ప్రకృతి దృశ్యాలలో క్లోజ్డ్-రోడ్ సైక్లింగ్ కార్యక్రమం టూర్ డి ఫ్రాన్స్ ద్వారా L’Etape దుబాయ్ (25 జనవరి 2026), దుబాయ్ మారథాన్ (1 ఫిబ్రవరి 2026) , బుర్జ్2బుర్జ్ హాఫ్ మారథాన్ (8 ఫిబ్రవరి 2026) వంటివి నగరం అంతటా మిస్ చేయలేని అనుభవాలుగా నిలుస్తాయి.
వీటితో పాటుగా హట్టాలో సాహసాలు, ఈక్వెస్ట్రియన్ అడ్వెంచర్స్ లో భాగంగా అరేబియా గుర్రాలపై థ్రిల్లింగ్ ఎడారి ప్రయాణం, మోటర్ స్పోర్ట్స్ కూడా ఆస్వాదించవచ్చు.
ప్రపంచ గుర్రపు పందెం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక పోటీలలో ఒకటైన 30వ దుబాయ్ ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ద్వారా తమ క్రీడా కార్యకలాపాలను దుబాయ్ పెంచుకుంటూనే ఉంది. అరంగేట్రం, ఫైనల్స్, కమ్యూనిటీ ఈవెంట్‌లు మరియు మైలురాయి క్షణాలతో నిండిన 2025–26 సీజన్ అత్యంత ఉత్తేజకరమైనదిగా ఉండబోతోంది.