ప్రపంచ స్థాయి పంట పరిష్కారాలతో యాంత్రీకరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న సిఎన్ హెచ్ ఇండియా
వ్యవసాయం మరియు నిర్మాణ యంత్ర సామాగ్రి పరికరాలు తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన CNH, పూణేలోని కంపెనీ అత్యాధునిక తయారీ కేంద్రంలో దాని అధునాతన, మేడ్-ఇన్-పూణే వ్యవసాయ యాంత్రీకరణ ఉత్పత్తులను ప్రదర్శించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
వ్యవసాయం మరియు నిర్మాణ యంత్ర సామాగ్రి పరికరాలు తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన CNH, పూణేలోని కంపెనీ అత్యాధునిక తయారీ కేంద్రంలో దాని అధునాతన, మేడ్-ఇన్-పూణే వ్యవసాయ యాంత్రీకరణ ఉత్పత్తులను ప్రదర్శించింది. CNH యొక్క బలమైన ఆర్&డి, ఇంజనీరింగ్ , తయారీ సామర్థ్యాలను పూణే ప్లాంట్ కలిగి ఉంది. ఇది దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం భారతదేశంలో ప్రపంచ స్థాయి హార్వెస్టింగ్ , పంట పరిష్కార పరికరాలను రూపొందించి, అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తుంది.
280,000 చదరపు మీటర్ల ఈ కేంద్రం కంబైన్ హార్వెస్టర్లు, చెరకు హార్వెస్టర్లు, స్మాల్ స్క్వేర్ బేలర్లు, ట్రాక్టర్లు, హెడర్లు, క్యాబ్‌లు మరియు పనిముట్లను తయారు చేస్తుంది. అధునాతన ఫ్యాబ్రికేషన్, ఆటోమేటెడ్ పెయింట్ సిస్టమ్స్, స్ట్రక్చర్డ్ అసెంబ్లీ లైన్లు మరియు కఠినమైన టెస్టింగ్ ప్రోటోకాల్‌లతో కూడిన ఈ ప్లాంట్ దేశవ్యాప్తంగా బహుళ పంటల యాంత్రీకరణకు మద్దతు ఇస్తుంది, అదే సమయంలో దాని ఉత్పత్తిలో కొంత భాగాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది.
CNH ఇండియా రీజియన్ అధ్యక్షుడు & మేనేజింగ్ డైరెక్టర్ నరీందర్ మిట్టల్ మాట్లాడుతూ, “భారతదేశంలో మా తయారీ కార్యకలాపాలకు అత్యంత కీలకంగా నిలవడంతో పాటుగా దేశంలో యాంత్రీకరణ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించాలనే మా నిబద్ధతకు చిహ్నం, CNH పూణే ప్లాంట్. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారతదేశం ముందుకు సాగుతున్న వేళ, వ్యవసాయ యాంత్రీకరణ అనేది వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ అంతటా ఉత్పాదకత, సామర్థ్యం మరియు స్థిరత్వాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ నేల మరియు వ్యవసాయ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన చెరకు హార్వెస్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, బేలర్లలో మా సాంకేతిక నాయకత్వం, ఇంధన-సమర్థవంతమైన, ఆధారపడతగిన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన యంత్రాల ద్వారా ప్రదర్శించబడుతుంది. భారతీయ రైతుల కోసం ఈ పరిష్కారాలను రూపొందించి ఉత్పత్తి చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు.
2023లో, ఈ కేంద్రం నుండి భారతదేశపు మొట్టమొదటి TREM-V ఉద్గార దశకు అనుగుణంగా ఉండే చెరకు హార్వెస్టర్‌ను CNH పరిచయం చేసింది. భారతదేశంలో చెరకు హార్వెస్టర్ , స్మాల్ స్క్వేర్ బేలర్ విభాగాలలో CNH 50% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్యాబ్ కంబైన్ హార్వెస్టర్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుంది.
అధునాతన యంత్రాలకు ఆవల, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడంపై కంపెనీ దృష్టి పెడుతుంది. భారతీయ వ్యవసాయాన్ని మార్చడానికి సమగ్రమైన విధానాన్ని సృష్టిస్తుంది. యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ, డ్రోన్ , డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో సహా వ్యవసాయ విస్తరణ విద్య, పర్యావరణ అనుకూల విధానంలో చెరకు సాగు , పంట అవశేషాల నిర్వహణ కార్యక్రమాలు ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో నడుస్తున్నాయి. పూణే కేంద్రం దాని పర్యావరణ అనుకూల మరియు భద్రతా పద్ధతులకు కూడా గుర్తింపు పొందింది. ఇది ఐజిబిసి (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) సర్టిఫికేట్ పొందింది, 2022 మరియు 2023లో అపూర్వమైన పనితీరు కోసం పారిశ్రామిక భద్రతా అవార్డులను అందుకుంది. కంపెనీ యొక్క 2030 సస్టైనబిలిటీ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా విద్యుత్ , నీటి సంరక్షణ పద్ధతులను అనుసరిస్తుంది. సమీప గ్రామాల్లోని కమ్యూనిటీ కార్యక్రమాలలో పాఠశాల మౌలిక సదుపాయాల మద్దతు మరియు మొబైల్ ఆరోగ్య సంరక్షణ సేవలు ఉన్నాయి.
చెరకు పంట కోతలో యాంత్రీకరణ స్థాయిలు ఇప్పటికీ 5% కంటే తక్కువగా, ధాన్యం కోతలో 30% కంటే తక్కువగా, పంట అవశేషాల నిర్వహణలో కేవలం 2% మాత్రమే ఉండటంతో, భారతదేశంలో వృద్ధికి అవకాశం గణనీయంగా ఉంది. పూణే ప్లాంట్ ఈ పరివర్తనకు కేంద్రంగా నిలుస్తుంది. రైతులు, వ్యవసాయ రంగంలోని వ్యవస్థాపకులు, బయోమాస్ అగ్రిగేటర్లు సామర్థ్యంతో ఉత్పాదకతను మెరుగుపరచడానికి వీలు కల్పించే యంత్రాలను ఈ ప్లాంట్ తయారు చేస్తోంది.