తమిళనాడు సీఎం స్టాలిన్‌.. సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా సీఎం స్టాలిన్‌ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాన్వాయ్‌ ఆపి బస్సు ఎక్కిన సీఎం స్టాలిన్‌.. అందులోనే కాసేపు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని కన్నాగిలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ సీఎం స్టాలిన్‌ పరిశీలించారు. అనంతరం అక్కడ ఆరోగ్య సిబ్బంది, వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారితో మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో అటుగా వెళ్తున్న ఓ బస్సును చూసిన సీఎం.. తన కాన్వాయ్‌ ఆపి కారు దిగి బస్సు ఎక్కాడు.

దీంతో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌, ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం స్టాలిన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న సదుపాయాలపై సీఎం ఆరా తీశారు. బస్సుల టైమింగ్స్‌, మహిళలకు ఉచిత టికెట్లు ఇస్తున్నారా లేదా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. మాస్క్‌లు పెట్టుకోని కొందరికి మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్వీట్టర్‌లో షేర్‌ చేసింది.


అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story