మోటార్ సైక్లింగ్‌కు డిజైన్-ఫస్ట్ విధానం సూచించిన క్లాసిక్ లెజండ్స్ కొత్త పేటెంట్

క్లాసిక్ లెజెండ్స్ ఒక కొత్త పేటెంట్ ను గెలిచింది, భారతదేశంలో డిజైన్ చే ప్రోత్సహించబడిన పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ తయారీదారుగా తన గుర్తింపును నిలుపుకుంటోంది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 16 Jan 2026 9:09 PM IST

మోటార్ సైక్లింగ్‌కు డిజైన్-ఫస్ట్ విధానం సూచించిన క్లాసిక్ లెజండ్స్ కొత్త పేటెంట్

క్లాసిక్ లెజెండ్స్ ఒక కొత్త పేటెంట్ ను గెలిచింది, భారతదేశంలో డిజైన్ చే ప్రోత్సహించబడిన పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ తయారీదారుగా తన గుర్తింపును నిలుపుకుంటోంది. అడ్జస్టబుల్ వైజర్ మరియు స్పీడోమీటర్ ను కలిగిన పేటెంట్ మొదట 2025 యెజ్డీ అడ్వంచర్ లో కనిపించింది, మరియు పేటెంట్స్ చట్టం, 1970 లోని ఏర్పాట్లు ద్వారా మార్చి 21, 2023 నుండి 20 సంవత్సరాల అవధి కోసం మంజూరు చేయబడింది. ఇది కంపెనీ యొక్క R&D రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణలు మరియు పేటెంట్ విజయాల చరిత్రలో రైడర్ పై దృష్టిసారించిన మరొక క్రియాత్మకమైన ఆవిష్కరణ.

రైడర్, మెషీన్, మరియు వాతావరణం మధ్యలో ఇంటర్ ఫేస్ ను అనుకూలం చేస్తూ, ఈ ఆవిష్కరణ అనేది క్లాసిక్ లెజెండ్స్ పెర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ యొక్క ఫలితంగా ఉంది, ఇది డిజైన్ నిర్ణయాలను ప్రోత్సహించడానికి ఆచరణాత్మకమైన రైడర్ ప్రయోజనాలను ఉపయోగించుకుంటుంది. తమ ఎత్తు మరియు రైడింగ్ సౌకర్యానికి అనుగుణంగా కఠినమైన భూభాగాల్లో రైడింగ్ చేసే సమయంలో కూడా వైజర్ మరియు స్పీడోమీటర్ ను సర్దుబాటు చేయడానికి ఈ ఫీచర్ రైడర్స్ కు అవకాశం ఇస్తుంది. భారతదేశం మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం మోటార్ సైకిళ్లను తయారుచేసే తమ క్రమంలో ఈ కంపెనీ శక్తివంతమైన మోటార్ సైక్లింగ్ వారసత్వాలతో బ్రాండ్స్ ను పునరుద్ధరిస్తూ, గణనీయమైన మేధో సంపత్తిని మరియు పరిశ్రమలో మొదటిసారి ప్రవేశపెట్టిన ఆవిష్కరణలను అభివృద్ధి చేసింది.

క్లాసిక్ లెజెండ్స్ గతంలో తమ ఎయిర్ ఫిల్టర్ మల్టిఫ్రీక్వెన్సీ రెసోనేటర్ కోసం ఒక పేటెంట్ ను గెలిచింది. ది తమ 650 సిసి మోటార్ సైకిల్స్, BSA గోల్డ్ స్టార్ మరియు BSA స్క్రాంబ్లర్ (UKలో లభ్యం) లో ఉపయోగించబడింది. సంప్రదాయబద్ధమైన రెసోనేటర్స్ ఒకే పౌనః పున్యంలో మాత్రమే పని చేస్తాయి కాగా పేటెంట్ పొందిన, పొందికైన రెసోనేటర్ ఇంజన్ యొక్క మొత్తం rpm పరిధిలో అనవసరమైన ఎయిర్ ఫిల్టర్ శబ్దాన్ని తొలగిస్తుంది.

కంపెనీ తమ లిక్విడ్-కూల్డ్ 334 సిసి ఇంజన్ ను మధ్యస్థ శ్రేణి వాహనాల విభాగం పరిణామం ఆరంభ దశలో ప్రవేశపెట్టింది. ఇది పాత ఎయిర్-కూల్డ్ ఇంజన్స్ పై ఇప్పటికీ ఆధారపడిన మార్కెట్ లో అత్యధిక పెర్ఫార్మెన్స్ మరియు థర్మల్ సామర్థ్యం దిశగా శ్రేణి ప్రయాణించడంలో సహాయపడింది. ఆల్ఫా 2 ఇంజన్ క్లాసిక్ లెజెండ్స్ మధ్యస్థ సామర్థ్యం పోర్ట్ ఫోలియో కు వెన్నుముకగా నిలిచింది.

క్లాసిక్ లెజెండ్స్ ఆరు-స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ , ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థలను మధ్యస్థమైన-సైజ్ కాటగిరికి ముందుగా తీసుకువచ్చింది, ప్రతి ఒక్కటి స్పష్టమైన రైడింగ్ విలువను చేర్చడంలో ఉపయోగించబడింది.

సుషీల్ సిన్హా, హెడ్- R&D, క్లాసిక్ లెజెండ్స్ ఇలా అన్నారు, “ఈ పేటెంట్ నిర్దిష్టమైన రైడర్-ఇంటర్ ఫేస్ సమస్యను పరిష్కరించవచ్చు కానీ ఇది మనం మోటార్ సైకిల్స్ గురించి ఎలా ఆలోచిస్తామో సూచిస్తుంది. క్లాసిక్ లెజండ్స్ లో, పెర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ ఫీచర్ ల సేకరణ గురించి కాదు. ఇది సంవత్సరాల తరబడి ఉపయోగించిన తరువాత కూడా ఒక మోటార్ సైకిల్ ఇచ్చే భావాలకు యాంత్రిక స్పష్టతను మరియు మన్నికను తీసుకురావాలి. రైడర్ మరియు రోడ్డుతో ప్రారంభమయ్యే డిజైన్ నిర్ణయాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. శక్తివంతమైన ఇంజనీరింగ్ పునాదితో రైడర్ -కేంద్రీయంగా మోటార్ సైకిళ్లను రూపొందిస్తూ ఉండటానికి ఈ గుర్తింపు మాకు తాజా ప్రోత్సాహంగా నిలుస్తుంది.”

క్లాసిగ్ లెజెండ్స్ పెర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ డిజైన్ భాషను తీర్చిదిద్దింది. దీనిలో రూపం యాంత్రికమైన పనితీరును అనుసరిస్తుంది. 2025 యెజ్డీ అడ్వంచర్ పై, కేంద్రీయంగా రౌట్ చేయబడిన ఎగ్జ్ హాస్ట్ థర్మల్ సామర్థ్యాన్ని మరియు రైడర్ సౌకర్యాన్ని మెరుగుపరిచింది, రెండు హెడ్ ల్యాంప్స్ గందరగోళాన్ని తొలగించే దృశ్యపరమైన గుర్తింపును, విశాలమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన కాంతిని అందిస్తాయి- ప్రతి ఒక్కటి ఉద్దేశ్యపూర్వకమైన ఇంజనీరింగ్ ఎంపిక, మరియు కేవలం స్టైలింగ్ వర్ధిల్లడం కాదు.

డిజైన్ మరియు ఇంజనీరింగ్ రెండిటినీ రైడర్ ఎర్గోనామిక్స్ మార్గనిర్దేశం చేయడంతో, అనుకూలీకరణ అదే ప్రాథమికాలను అనుసరిస్తుంది. 2025 రోడ్ స్టర్ యొక్క అడ్జస్టబుల్ సీటింగ్ ఆకృతులు, సమతుల్యత కలిగిన రైడింగ్ త్రిభుజం, అందుబాటులో ఉన్న సీట్ ఎత్తు, మరియు ఫ్యాక్టరీ ఆధారిత అనుకూలమైన ఎంపికలు ఛాసిస్ జామితి, మౌంటింగ్ వ్యూహాలు, మరియు అభివృద్ధి ప్రారంభంలో చేసిన నిర్మాణపరమైన డిజైన్ నిర్ణయాల నుండి ఏర్పడ్డాయి.

మధ్యస్థమైన సామర్థ్య విభాగం దాటి, క్లాసిక్ లెజెండ్స్ భారతదేశంలో ఉత్పత్తిలో ఉన్న అతి పెద్ద ఒకే సిలిండర్ 650 సిసి ఇంజన్ లలో ఒకటైన BSA గోల్డ్ స్టార్ తో తమ ఇంజనీరింగ్ ధ్యేయాన్ని ప్రదర్శించింది, ఆధునిక మెకానికల్ వ్యవస్థలతో పాటు అత్యధిక డిస్ ప్లేస్మెంట్ ప్లాట్ ఫాంలను రూపొందించే మరియు తయారు చేసే సామర్థ్యాన్ని పునః శక్తివంతం చేస్తుంది.

ఇంజనీరింగ్ ప్రతిభ, ఇన్- హౌస్ R&D, మరియు డిజైన్ సమ్మిళతంలో క్లాసిక్ లెజండ్స్ సుస్థిరమైన పెట్టుబడి అనేది రెండు పేటెంట్లు గెలవడం, రెండు దాఖలు చేయడం మరియు పరిశ్రమలోనే ఎన్నో మొదటిసారి ప్రయత్నాలు సహా గుర్తింపుకు దారితీసాయి.

Next Story