మారుతున్న రుతువులు.. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా.?
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అలర్జీ కారకాల బారిన ఎక్కువగా పడటం, రోజువారీ దినచర్యలో మార్పులు... ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. దీనివల్ల మనం జలుబు, ఫ్లూ, అలసట బారిన సులభంగా పడే అవకాశం ఉంది.
న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ ప్రకారం, "ఈ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆధారం. బాదం, ఆకుకూరలు, కొవ్వు ఉండే చేపలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. అలాగే, శరీర సహజ రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడానికి తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇందుకు మీ దినచర్యలో సులభంగా, ప్రభావవంతంగా చేర్చుకోగలిగేది కాలిఫోర్నియా బాదం. ఇది చిన్న గింజ అయినా, రోగనిరోధక శక్తికి పెద్ద ప్రయోజనాలను అందిస్తుంది."
రుతువులు మారుతున్నప్పుడు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి రితక ఈ ఆచరణాత్మక చిట్కాలను పంచుకున్నారు:
మీ రోజువారీ రక్షణ డోస్
కాలిఫోర్నియా బాదంలో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థకు ఒక కవచంలా పనిచేస్తాయి. మారుతున్న వాతావరణంలో మిమ్మల్ని బలంగా ఉంచడానికి రక్షణ కవచంలా ఉంటాయి. ఇవి కాపర్ (రాగి)కి కూడా మంచి మూలం. ఈ ఖనిజం రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు మద్దతు ఇస్తుంది.
హాయిగా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి
పోషణ మాత్రమే సరిపోదు: మీ శరీరం రీఛార్జ్ కావడానికి, మరమ్మత్తు చేసుకోవడానికి తగినంత విశ్రాంతి కూడా అవసరం. మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి, రుతువుల మార్పులను తట్టుకోవడానికి ప్రతి రాత్రి 7–8 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి.
హైడ్రేటెడ్‌గా ఉండండి (శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూడండి)
ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతారు. హైడ్రేటెడ్‌గా ఉండటం శరీర విధులను నియంత్రించడంలో, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో, టాక్సిన్‌లను (విష పదార్థాలను) బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది రోజంతా మిమ్మల్ని రిఫ్రెష్‌గా, శక్తివంతంగా ఉంచుతుంది.
మీ ప్లేట్‌ను బ్యాలెన్స్ చేసుకోండి
బాగా ఇష్టపడి తినే ఆహార పదార్థాలతో పాటు, సలాడ్లు లేదా తాజా పండ్లు వంటి తేలికైన, పీచుపదార్థాలు (ఫైబర్) అధికంగా ఉండే వాటిని జతచేయండి. సాల్మన్, అవిసె గింజలు (flax seeds) వంటి ఆహారాన్ని చేర్చుకోండి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను (శరీరంలో మంట/వాపు) తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
కదులుతూ ఉండండి
చిన్నపాటి కదలిక కూడా పెద్ద మార్పును తెస్తుంది. అది చురుకైన నడక అయినా, తేలికపాటి స్ట్రెచింగ్ అయినా, లేదా కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేయడమైనా... చురుకుగా ఉండటం రక్త ప్రసరణను పెంచుతుంది, ఈ సీజన్‌లో వచ్చే అలసటతో పోరాడటానికి సహాయపడుతుంది. రోజుకు 10–15 నిమిషాల పాటు యాక్టివ్‌గా ఉండటం కూడా మీ శక్తి స్థాయిలను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనం కొత్త రుతువులోకి ప్రవేశిస్తున్నప్పుడు, ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి మన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం చాలా అవసరం. కాలిఫోర్నియా బాదం, సాల్మన్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, బాగా నిద్రపోవడం, చురుకుగా ఉండటం వంటి సులభమైన, ప్రభావవంతమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా, మీరు మీ శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మీ ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధతో, మీరు మీ శ్రేయస్సును కాపాడుకుంటూనే, ఈ సీజన్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటారు.