బెంగళూరు విద్యార్థి AI ఆధారిత ఆవిష్కరణ.. దృష్టి లోపం ఉన్నవారికి ఉపయోగపడే స్మార్ట్ గ్లాసెస్

బెంగళూరుకు చెందిన పందొమ్మిదేళ్ల తుషార్ షా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక గాడ్జెట్‌ను మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత మరియు ఆవిష్కరణ కలయికను ప్రతిబింబించే పరిష్కారాన్ని అందించాడు.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 13 Nov 2025 8:48 PM IST

బెంగళూరు విద్యార్థి AI ఆధారిత ఆవిష్కరణ.. దృష్టి లోపం ఉన్నవారికి ఉపయోగపడే స్మార్ట్ గ్లాసెస్

బెంగళూరుకు చెందిన పందొమ్మిదేళ్ల తుషార్ షా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక గాడ్జెట్‌ను మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత మరియు ఆవిష్కరణ కలయికను ప్రతిబింబించే పరిష్కారాన్ని అందించాడు. అతని ఆవిష్కరణ, పెర్సీవియా-దృష్టి లోపం ఉన్నవారికి సహజమైన గ్లాసెస్-శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025 యొక్క జాతీయ విజేతలలో అతనికి స్థానం సంపాదించింది.

శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో సంస్థ యొక్క ప్రధాన విద్యా కార్యక్రమం, ఇది యువ ఆవిష్కర్తలను వాస్తవ ప్రపంచ సమస్యలను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం కార్యక్రమం “ఏఐ ఫర్ ఎ సేఫర్, స్మార్టర్ అండ్ ఇంక్లూజివ్ భారత్”, “ఫ్యూచర్ ఆఫ్ హెల్త్, హైజీన్ అండ్ వెల్-బీయింగ్ ఇన్ ఇండియా; ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వయా టెక్నాలజీ” మరియు “సోషల్ చేంజ్ త్రూ స్పోర్ట్ అండ్ టెక్ ” అనే అంశాలపై కేంద్రీకృతమైంది. ఈ థీమ్‌లలో ఆవిష్కరణాత్మక పరిష్కారాలను అందించిన నాలుగు విజేత జట్లు ఐఐటి ఢిల్లీలో ₹1 కోటి విలువైన మద్దతును పొందాయి.

దృష్టి లోపం ఉన్న వినియోగదారులు ధ్వని మరియు స్పర్శ ద్వారా వారి పరిసరాలను గ్రహించేందుకు పెర్సీవియా రూపుదిద్దుకుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఆడియో సెన్సార్లు, ఆబ్జెక్ట్ రికగ్నిషన్ కెమెరాలు, మరియు AI ఆధారిత ప్రాదేశిక విశ్లేషణలతో కూడిన సమగ్ర వ్యవస్థ పనిచేస్తుంది. ఇది వస్తువులను గుర్తించడం, దూరాలను అంచనా వేయడం, అలాగే మానవ స్వరాలు మరియు ముఖాలను గుర్తించడం ద్వారా వినియోగదారుని చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని వివరించగలదు. ఈ పరికరం సూక్ష్మ కంపనాలు లేదా నిజ-సమయ వాయిస్ ఫీడ్‌బ్యాక్ ద్వారా అప్రమత్తం చేస్తూ, వినియోగదారుని పర్యావరణానికి ఒక రకమైన "సెన్సరీ మ్యాప్"ను సృష్టిస్తుంది.

మా ఇంటి దగ్గర “నేను దృష్టి లోపం ఉన్న వారితో పాటలు పెరిగాను,” అని తుషార్ గుర్తుచేసుకుంటాడు. “రోడ్డు దాటడం, వ్యక్తులను లేదా వస్తువులను గుర్తించడం వంటి సాధారణ పనులు వారికి ఎంత పెద్ద సవాళ్లుగా మారుతాయో నేను స్వయంగా చూశాను. ఆ అనుభవం నాలో ఒక స్పష్టమైన లక్ష్యం - వారికి స్వాతంత్ర్య భావం మరియు ఆత్మవిశ్వాసాన్ని అందించే పరిష్కారాన్ని సృష్టించాలి అని నిర్ణయించుకున్నాను.”

“ఆ సమయంలో నా ఆలోచన, నా టెక్నికల్ జ్ఞానానికి మించి ఉంది,” అని ఆయన చెబుతాడు. “నాకు కంప్యూటర్ విజన్ లేదా హార్డ్‌వేర్ డిజైన్‌ గురించి ఎక్కువగా తెలియదు. కానీ ఆ లోటును పూరించడానికి, శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో నాకు అవసరమైన సహాయం, విశ్వాసం, మార్గదర్శకత్వాన్ని కూడా అందిచ్చింది.”

“నేను స్క్రీన్ వివరణ కోసం జెమిని 2.0 ఫ్లాష్‌ను ఉపయోగించాను, అలాగే దృష్టి లోపం ఉన్న వాలంటీర్లు ఇచ్చిన డేటాతో ముఖాలు మరియు వస్తువులను గుర్తించే ఫీచర్లు రూపొందించాను,” అని ఆయన చెప్పారు. “వారి ఫీడ్‌బ్యాక్ ద్వారా ప్రోటోటైప్‌లో ఉన్న లోపాలను గుర్తించగలిగాను, సిద్ధాంతంగా బాగా పనిచేసిన విషయాలు, వాస్తవ వినియోగంలో మళ్లీ మళ్లీ మార్చాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాను.”

దేశం యొక్క అత్యంత ముఖ్యమైన సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశం అంతటా వేలాది మంది యువ ఆవిష్కర్తలను ఆహ్వానించిన శామ్‌సంగ్ సోల్వ్ ఫర్ టుమారో కార్యక్రమం, తుషార్‌కు తన ఆలోచనను నిజం చేయడానికి వేదికగా, అలాగే మద్దతుగా నిలిచింది.

“మాకు మార్కెట్‌ను ఎలా అర్థం చేసుకోవాలో, పరిశోధన ఎలా చేయాలో, భాగస్వాములతో ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఒక ఆలోచనను ఒక సంస్థగా మార్చే విధానంపై ఇది ఒక వేగవంతమైన కోర్సు లాంటిది,” అని తుషార్ అన్నారు.

తుషార్ ప్రాజెక్ట్‌ను శామ్‌సంగ్ సీనియర్ లీడర్‌షిప్, అలాగే విద్య, ప్రభుత్వం, పరిశ్రమల నిపుణులతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది. ఈ సంవత్సరం పోటీలో ఉన్న నాలుగు ప్రధాన అంశాలలో — ఆరోగ్యం మరియు పరిశుభ్రత భవిష్యత్తు, సాంకేతికత ద్వారా పర్యావరణ స్థిరత్వం, క్రీడల ద్వారా సామాజిక మార్పు వంటి వాటితో పాటు ‘సురక్షితమైన, తెలివైన మరియు సమగ్రమైన భారత్ కోసం AI’ అనే విభాగంలో అతని ఆవిష్కరణ విజేతగా నిలిచింది.

తుషార్‌కు ఈ విజయం ఒక ముగింపు మాత్రమే కాకుండా కొత్త ఆరంభం కూడా. "శామ్‌సంగ్ సోల్వ్ ఫర్ టుమారో” గెలవడం, నేను ఊహించని అవకాశాలను నాకు అందిచ్చింది," అని అతను చిరునవ్వుతో చెప్పాడు. "యాక్సెసిబిలిటీ టెక్నాలజీపై పనిచేసే బ్రాండ్‌లతో కలసి పనిచేయాలని, ప్రోడక్టు రూపకల్పనను మెరుగుపరచాలని మరియు భారతదేశం అంతటా అందరికీ అందుబాటులో ఉంచాలని అనుకుంటున్నాను. అదే సమయంలో నా చదువును కొనసాగిస్తున్నాను, నిజంగా పరివర్తన కలిగించేదాన్ని సృష్టించే ముందు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది."

రాబోయే సంవత్సరంలో తుషార్, పెర్సీవియాను మరింత మంది వినియోగదారులతో పరీక్షించాలని, మొబిలిటీ ట్రైనర్ల నుండి సూచనలు పొందాలని, అలాగే ఇండోర్ నావిగేషన్ కోసం కొత్త ఫీచర్లను జోడించాలని అనుకుంటున్నాడు. అతని తుదిలక్ష్యం ఏమిటి? ఈ పరికరం కూడా సాధారణ కళ్లజోడులా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి — కొద్దిమందికి మాత్రమే విలాసం కాదు, అందరికీ చేరువయ్యే హక్కుగా ఉండాలి.

Next Story