అమెజాన్ ప్రైమ్ డే 2025 : అత్యధికంగా షాపింగ్ జరిగిన ప్రైమ్ డే ఈవెంట్ ఇదే
ఈ ప్రైమ్‌డే రోజున మరింత ఎక్కువ మంది సభ్యులు, భారతదేశంలో ఇంతకు ముందు ఏ ప్రైమ్ డే ఈవెంట్ సందర్భంగానూ చేయనంత ఎక్కువ షాపింగ్ చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు
ఈ ప్రైమ్‌డే రోజున మరింత ఎక్కువ మంది సభ్యులు, భారతదేశంలో ఇంతకు ముందు ఏ ప్రైమ్ డే ఈవెంట్ సందర్భంగానూ చేయనంత ఎక్కువ షాపింగ్ చేశారు. ఈ సంవత్సరం ప్రైమ్ డే ఈవెంట్, మూడు రోజుల సమయంలో రికార్డు స్థాయిలో విక్రయాలతో, మరిన్ని ఎక్కువ ఐటెమ్స్ అమ్ముడుపోయి, క్రిందటి సంవత్సరం ప్రైమ్ డే ఈవెంట్ కన్నా ఘనంగా జరిగింది. ఈవెంటుకు ముందు 70 శాతం కొత్త ప్రైమ్ సైన్-అప్లు 2వ శ్రేణి మరియు 3వ శ్రేణి పట్టణాల నుండి నమోదు కావటం ఎన్నదగిన విషయం. ప్రైమ్ డే 2025 కూడా, భారతదేశవ్యాప్తంగా చిన్న మరియు మధ్యతరహా వ్యాపారవర్గాల(ఎస్ఎంబిల)కు, అమోఘమైన విజయంగా నిలిచింది. ప్రైమ్ డే 2025 సందర్భంగా, అన్ని ఎడిషన్ల వ్యాప్తంగా విక్రయాలను అందుకున్న ఎస్ఎంబిల సంఖ్య అత్యధికస్థాయికి చేరుకుంది. పైగా, ఎస్ఎంబిలలో పాల్గొంటున్న వారిలో 68 శాతానికి పైగా ఎస్ఎంబిలు 2-3 శ్రేణి నగరాలు, ఇంకా ఆవలి ప్రాంతాలకు చెందినవి.
అక్షయ్ సాహీ, అమెజాన్ ప్రైమ్ హెడ్, డెలివరీ అండ్ రిటర్న్స్ ఎక్స్పీరియన్సెస్, భారతదేశం మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఇలా అన్నారు, “భారతదేశంలో అతి పెద్ద ప్రైమ్ డేను నిర్వహించేందుకు మాకు సహకరించిన మా విక్రేతలకు, బ్రాండ్లకు మరియు బ్యాంక్ భాగస్వాములకు, మేము ధన్యవాదాలు తెలిచేయగోరుతున్నాము. ప్రైమ్ సభ్యులు ఇంతకు మునుపు జరిగిన ప్రైమ్ డే షాపింగ్ ఈవెంట్లు అన్నింటి కన్నా ఎక్కువ ఐటెమ్‌లను కొనుగోలు చేశారు. కాగా, అదే రోజులో అత్యధిక డెలివరీలతో మేము సరికొత్త రికార్డును స్పీడులో నమోదు చేశాము. మా కస్టమర్లు సహాయపడి, వారు ఎక్కువ సొమ్ము ఆదా చేసుకునేట్లు చేయటం మాకు సంతోషాన్నిస్తుంది. ప్రైమ్ డే అనేది, విలువకు, ఫాస్ట్ డెలివరీలకు, గొప్ప డీల్సుకు, కొత్త ఉత్పత్తుల విడుదలకు మరియు బ్లాక్‌బస్టర్ వినోదానికి ప్రైమ్ మెంబర్షిప్ అందించే అతి గొప్ప వేడుక.
మా అసోసియేట్ల సంక్షేమం కోసం మేము ఇటీవల పెట్టిన 2000 కోట్ల రూపాయల పెట్టుబడి, మా కార్యకలాపాల ప్రమాణాలను పెంపొందించటం కారణంగా మేము ఈ ఏడాది మరింత వేగంగా మరియు సురక్షితంగా డెలివర్ చేయగలిగాము. భారతదేశవ్యాప్తంగా వేగవంతమైన, మరియు విశ్వసనీయమైన డెలివరీలను అందిస్తూ మా ప్రైమ్ మెంబర్లకు సంతోషాన్ని కలిగిస్తున్న మా డెలివరీ పార్ట్నర్లకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము.” అని ఆయన అన్నారు.
అమెజాన్ బిజినెస్ తో వ్యాపార కస్టమర్లలో అభివృద్ధి
ప్రైమ్ డే సందర్భంగా, ఎర్లీ డీల్స్, ఉచిత మరియు ఫాస్ట్ షిప్పింగ్ లాభాలను పొందేందుకు వ్యాపారవర్గాల వారు ఎన్రోల్ కావటంతో ‘పెయిడ్ ప్రైమ్ సైనప్స్’లో 7X అభివృద్ధి చెంది, కొత్త కస్టమర్ల రిజిస్ట్రేషన్లో అమెజాన్ బిజినెస్ 3 రెట్ల పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రైమ్ డే సందర్భంగా అగ్రశ్రేణి విభాగాలైన టెలివిజన్లు (13X), రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు (8X), టాబ్లెట్లు (8.7X), ప్రింటర్లు (7.6X) మరియు ల్యాప్ టాప్ ల (5X)లో అమోఘమైన పెరుగుదల చోటుచేసుకోవటంతో, బల్క్ ఆర్డర్లలో దాదాపు 7 రెట్ల పెరుగుదల అమెజాన్ బిజినెస్ లో కనిపించింది.
అమెజాన్ పే
· గత ఏడాదితో పోలిస్తే. 1.4X ఎక్కువ మంది కస్టమర్లు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఈ ప్రైమ్ డే సందర్భంగా ఉపయోగించుకున్నారు. వీరిలో 50 శాతం కన్నా ఎక్కువ మంది 2వ శ్రేణి మరియు 3వ శ్రేణి పట్టణాలకు చెందినవారు
· అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కస్టమర్లు భారీగా సొమ్మును ఆదా చేసుకున్నారు. దీని వలన వారికి 5% తక్షణ డిస్కౌంట్ * , దానితోపాటే అపరిమితమైన 5% క్యాష్ బ్యాక్* లభించింది.
· మొట్టమొదటిసారిగా, ఫ్లైట్లు మరియు హోటల్స్ బుక్ చేసుకునే కొత్త ప్రైమ్ కస్టమర్ల సంఖ్యలో అమెజాన్ కు 2.7 X కన్నా ఎక్కువ పెరుగుదల కనిపించింది.
· ప్రైమ్ డే 2025 సందర్భంగా 50% పైగా కస్టమర్లు తమ అమెజాన్ పే లేటర్ క్రెడిట్ లైన్ ను ఉపయోగించుకున్నారు. ఈ ఖర్చులో ~55% కొనుగోళ్ళు వంటగది, దుస్తులు, షూస్, మరియు సౌందర్యసాధనాల పై పెట్టటం జరిగింది.