అట్-హోమ్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభించిన అమేజాన్‌ ఇండియా

అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ను అమేజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 22 Jun 2025 3:45 PM IST

అట్-హోమ్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభించిన అమేజాన్‌ ఇండియా

అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ను అమేజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. కస్టమర్లు ల్యాబ్ పరీక్షలు బుక్ చేయడానికి, అప్పాయంట్మెంట్స్ ను షెడ్యూల్ చేయటానికి, ట్రాక్ చేయడానికి, అమేజాన్ యాప్ నుండి వెంటనే డిజిటల్ రిపోర్ట్స్ ను యాక్సెస్ చేయడానికి ఒక కొత్త అట్–హోమ్ డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించింది. అమేజాన్ డయాగ్నిస్టిక్స్ తో, 6 నగరాల్లోని 450+ పిన్ కోడ్స్ కస్టమర్లు సులభంగా 800కి పైగా డయాగ్నోస్టిక్స్ పరీక్షలను బుక్ చేయవచ్చు, 60 నిముషాలు లోగా ఇంటి వద్ద శ్యాంపిల్ సేకరణ మరియు వాడుకగా చేసే సాధారణ పరీక్షలు కోసం 6 గంటల లోపు డిజిటల్ రిపోర్ట్స్ ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబయి మరియు హైదరాబాద్ లలో లభిస్తోంది. అమేజాన్ డయోగ్నిస్టిక్స్ ప్రస్తుతం ప్రముఖ గుర్తించబడిన డయోగ్నిస్టిక్ ప్రొవైడర్ ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ సహకారంతో ఈ సేవలు అందిస్తోంది.

ఎక్కువసేపు వేచి ఉండటం, నాణ్యత ఏకరీతిగా లేకపోవడం మరియు అందుబాటులో లేకపోవడం వంటి నివారణా సంరక్షణను తరచు ఆటంకపరుస్తున్న సమస్యలను అమేజాన్ డయాగ్నోస్టిక్స్ పరిష్కరించడానికి ముందుకు వచ్చింది. వేగంగా, నమ్మకంగా మరియు అన్వేషించవలసిన అవసరం లేకుండా లేదా ఎక్కువసేపు వేచి ఉండటం భరించనవసరం లేకుండా డయోగ్నిస్టిక్స్ సేవలను పొందడానికి అమేజాన్ డయాగ్నోస్టిక్స్ కస్టమర్లకు వీలు కల్పిస్తోంది. దీని ద్వారా వేగంగా ఇంటి వద్ద శ్యాంపిల్ సేకరణ జరుగుతుంది, సకాలంలో రిపోర్ట్స్ అందచేయబడతాయి, మరియు కఠినమైన డేటా గోప్యత మరియు నాణ్యతా ప్రామాణాలు అనుసరించబడతాయి. ప్లాట్ ఫారం వాస్తవిక సమయంలో స్లాట్ కనిపించడం, మ్యాప్–ఆధారంగా చిరునామా ధృవీకరణ, అమేజాన్ హెల్త్ డాష్ బోర్డ్ ద్వారా సురక్షితమైన డిజిటల్ రిపోర్ట్ పొందడం మరియు స్వయంచాలిత పరీక్షా తయారీ సూచనలు వంటి తెలివైన ఫీచర్లను కూడా చేర్చింది- ఇవన్నీ నిరంతరంగా బుక్కింగ్ చేయడానికి తోడ్పడతాయి.

ఈ ప్రారంభంతో, అమేజాన్ కస్టమర్లు ఇప్పుడు పూర్తి ఎండ్-టు-ఎండ్ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలరు, అనగా టెలీ-సంప్రదింపు నుండి, మందులను డెలివరీ చేయడం, గుర్తించబడిన పరీక్షలు, అన్నీ ‘అమేజాన్ మెడికల్‘ ద్వారా పొందవచ్చు.

ఈ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ, జయరామ కృష్ణన్, బాల సుబ్రమణియన్- కాటగిరి నాయకుడు, అమేజాన్ మెడికల్ ఇలా అన్నారు, “కస్టమర్లు అందరి కోసం ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో, విశ్వశనీయంగా మరియు సౌకర్యంగా చేయడంలో అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ఒక గణనీయమైన ముందడుగును సూచిస్తోంది. ఉన్నతమైన నాణ్యత, డాక్టర్-ధృవీకరించిన ల్యాబ్ పరీక్ష నిరంతరంగా అమేజాన్ యాప్ లోకి సమీకృతమవడం కేటాయించడం ద్వారా, తమ ఇంటి సౌకర్యం నుండి ప్రపంచ స్థాయికి చెందిన డయోగ్నిస్టిక్ సదుపాయాలతో మా కస్టమర్లను సమర్థవంతులను చేస్తున్నాము. మా కస్టమర్లకు ఆరంజ్ హెల్త్ సేవలను అందచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఆరంజ్ హెల్త్ వంటి గుర్తించబడిన సర్వీస్ ప్రొవైడర్ తో మా ప్రమేయం డయోగ్నిస్టిక్ శ్రేష్టతకు హామీ ఇస్తుంది, అమేజాన్ వారి కార్యకలాపాల నిపుణుత వేగం, నమ్మకం మరియు విశ్వాసాలను నిర్థారిస్తుంది.”

ఈ భావోద్వేగం గురించి వ్యాఖ్యానిస్తూ, ధ్రువ్ గుప్తా, సహ స్థాపకులు, ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ ఇలా అన్నారు, “మా కస్టమర్లకు డయోగ్నిస్టిక్స్ గొప్పగా ప్రతిస్పందించేలా మరియు నమ్మకంగా చేయడానికి మేము 2021 ప్రారంభంలో ఆరంజ్ హెల్త్ ను ప్రారంభించాము. ఈ కేంద్రీకరణ మాకు కస్టమర్ ల పట్ల ఎంతో ప్రేమను కలగచేసింది మరియు ఈ రోజు భారతదేశంలో ప్రముఖంగా గుర్తించబడిన ల్యాబ్స్ లో ఒకటిగా నిలిచింది. మేము ఎల్లప్పుడూ అమేజాన్ వారి ఆవిష్కరణ, కస్టమర్ పట్ల అభిమానం, మరియు జీవితాలను ఉన్నతమైన స్థాయిలో మార్చగలిగే సామర్థ్యాన్ని ఆరాధిస్తాము. వారితో భాగస్వామం చేయడం ఆరంజ్ హెల్త్ అయిదేళ్ల లోపు సంపాదించిన నమ్మకాన్ని నిర్థారిస్తోంది. అమేజాన్ తో కలిసి, మేము స్థాయిని పెంచుతాము, భారతదేశ ప్రజలకు మరింత వేగంగా, నమ్మకమైన మరియు అవగాహనతో కూడిన డయోగ్నిస్టిక్స్ అనుభవాన్ని అందచేస్తాము.”

అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం అనేది భారతదేశంవ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం పూర్తిగా సమీకృతమైన ఆరోగ్య సంరక్షణ అనుభవాన్ని రూపొందించే కంపెనీ వారి కలను గణనీయమైన మైలురాయిని సూచిస్తోంది. ఈ విస్తరణ అనేది ఫార్మసీ మరియు క్లీనిక్ యొక్క ఇప్పటికే ఉన్న సేవలు ఆధారంగా అమేజాన్ మెడికల్ పునాదిని శక్తివంతం చేస్తోంది. అమేజాన్ ఫార్మసీతో, కస్టమర్లు విస్తృతశ్రేణి ప్రిస్క్రిప్షన్ మందులు మరియు ఆరోగ్య సంరక్షణ అవసరాలు పొందడంతో పాటు ఉచిత టెలీ వైద్యం సంప్రదింపు సేవలు మరియు ప్రైమ్ మరియు నాన్ –ప్రైమ్ సభ్యుల కోసం డెలివరీ ప్రయోజనాలు కూడా పొందుతారు. అమేజాన్ క్లీనిక్ నిరంతరంగా డిజిటల్ అనుభవం ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరాల శ్రేణి కోసం లైసెన్స్ గల డాక్టర్లను సంప్రదించడానికి కస్టమర్లకు వీలు కల్పిస్తోంది. డయోగ్నిస్టిక్స్ ను చేర్చడం అనేది ల్యాబ్ పరీక్ష కూడా అదే నిరంతర సంరక్షణ విభాగంలోకి వస్తుంది, తత్ఫలితంగా కస్టమర్లు తమ ఇళ్ల నుండి డాక్టర్ సిఫారసు చేసిన పరీక్షలను పూర్తి చేయవచ్చు. అమేజాన్ మెడికల్ కింద ఇప్పుడు మూడు సేవలు సమీకృతమవడంతో, అమేజాన్ ఇప్పుడు సంప్రదింపు నుండి పరీక్షలు వరకు సింగిల్, నమ్మకమైన ఇంటర్ ఫేస్-అమేజాన్ మెడికల్ పై కనక్ట్ చేయబడిన అవుట్ పేషంట్ ప్రయాణాన్ని అందిస్తోంది.

నిరాకరణ: ఉత్పత్తి వివరాలు, వర్ణన, పరీక్షా రిపోర్ట్స్, ఫీచర్లు, డీల్స్, ధరలు మరియు ఇతర క్లెయిమ్స్ అనేవి విక్రేతలు మరియు బ్యాంకింగ్/ఫైనాన్స్ భాగస్వాములు అందచేసినవి. అమేజాన్ ధరల్లో నిమగ్నం కాలేదు లేదా ఉత్పత్తులు, రిపోర్ట్స్ లేదా తత్సంబంధిత క్లెయిమ్స్ కు ప్రమేయాన్ని కలిగి లేదు మరియు ఉత్పత్తి సమాచారం లేదా విక్రేతలు కేటాయించిన పరీక్షా రిపోర్ట్ ఖచ్చితత్వం కోసం బాధ్యతవహించదు. డీల్స్ మరియు డిస్కౌంట్లను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్స్ అందచేస్తున్నారు. Amazon.in అనేది ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం మరియు స్టోర్ పదం అనేది విక్రేతలు అందించే ఎంపికతో స్టోర్ ఫ్రంట్ ను సూచిస్తుంది.

Next Story