త్వరలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 12:21 PM GMT
త్వరలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం విజయవంతమైన సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం గురువారం చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. మెగాస్టార్‌ చిరంజీవిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలను ఫిలింక్రిటిక్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం అందించింది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 50 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని చిరంజీవికి తెలియజేశారు. గోల్డెన్‌జూబ్లీ వేడుకను వైభవంగా నిర్వహించబోతున్నామన్నారు. ఈ వేడుకకు చిరంజీవిని ఆహ్వానించడం జరిగింది. వెంటనే ఆయన తప్పకుండా వస్తానని చెప్పారన్నారు. మెగాస్టార్‌ను కలిసిన వారిలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కొండేటి సురేష్‌, కార్యదర్శి ఇ. జనార్దన్‌రెడ్డి, గోల్డెన్‌జూబ్లీవేడుక ఛైర్మన్‌ బి.ఎ.రాజు, సీనియర్‌ జర్నలిస్టు ప్రభు, అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు డి.జె.భవాని, సజ్జావాసు, కోశాధికారి భూషణ్‌, పర్వతనేని రాంబాబు, మడూరి మధు, కార్యవర్గ సభ్యులు సాయిరమేష్‌, ముత్యాల సత్యనారాయణ, మురళి (శక్తిమాన్‌), చిన్నమూల రమేష్‌, జిల్లా సురేష్‌ తదితరులు వున్నారు.

Next Story
Share it