బీహార్‌కు వచ్చినప్పుడు గ్లాసు గేదె పాలు తాగుతా: సోనూసూద్
By సుభాష్ Published on 21 Aug 2020 1:03 PM ISTప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్. ఇప్పుడు సోనూసూద్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందికి తనకు తోచిన విధంగా సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎంతో మంది ధనికులున్నా.. సోనూసూద్ లాంటి వ్యక్తి పేదలకు అండగా నిలుస్తూ వారి గుండెల్లో ఓ దేవుడిగా నిలుస్తున్నారు.
ఆపదలో ఉన్నవారికి నేనున్నాను.. అంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం జీవించేందుకు అసలైన ఆదాయమైన గేదె చనిపోవడంతో వారికి మరో గేదెను కొనిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే వారి కోసం కొత్త గేదెను కొన్నప్పుడు కలిగిన సంతోషం.. నా తొలికారు కొన్నప్పుడు కలగలేదని సోనూసూద్ ట్వీట్ చేశారు. అంతేకాదు బీహార్ వచ్చినప్పుడు ఆ గేదె పాలు గ్లాసు తాగుతానంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, బీహార్ చంపారన్‌లోని భోలా గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి పాల వ్యాపారమే జీవనాధారం. ఇటీవల ఆ గేదె మృతి చెందింది. దీంతో గేదె మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఈ విషయాన్ని స్థానికులు కొందరు ట్విట్టర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సోనూసూద్ కొత్త గేదెను వారికి అందేలా తక్షణ చర్యలు చేపట్టారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇంతటి సాయం చేసిన సోనూసూద్‌కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.