ఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. అనారోగ్యం కారణంగా ఆమె ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీకి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పార్టీకి చెందిన కొందరు నేతల సమాచారం ప్రకారం.. ఆమె సాధారణ హెల్త్‌ చెకప్‌ వెళ్లారని చెబుతున్నారు. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ఇంకా ఎటువంటి సమచారం అందలేదు. సోనియా గాంధీని రాత్రి 7 గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి గతంలో ఆమె ఉదర సంబంధిత వ్యాధితో బాధపడింది. సోనియా ఆస్పత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆస్పత్రికి క్యూ కట్టారు. ప్రస్తుతం ఆమె వెంట తనయుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు ఉన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.