ఫోన్  పిచ్చిలో పడి ఎవరు ఏమి చేస్తున్నారో కూడా తెలీదు. ఫోనులో మాట్లాడుతూ ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలీదు కొందరికి..! అలా కొందరు కొన్ని కొన్ని సార్లు ఫోన్ లో మాట్లాడుతూ అపాయంలో పడుతూ ఉంటారు. అలాంటిదే ఓ మహిళ విషయంలో చోటుచేసుకుంది.

ఫోన్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఓ పాము మీద కూర్చుంది ఆ మహిళ. ఇంతలో ఆ పాము కాటేసింది. పాము కాటుకు గురైన ఆ మహిళను ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన గోరఖ్ పూర్ లోని రియానవ్ గ్రామంలో చోటుచేసుకుంది. జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి థాయ్ ల్యాండ్ లో పనిచేస్తున్నాడు. ఆయన తన భార్య గీతకు కాల్ చేశాడు. ఇంతలో ఆమె బెడ్ రూమ్ లోకి రెండు పాములు ప్రవేశించాయి. ఆ విషయం తెలియని గీత గదిలోకి వచ్చి తన బెడ్ మీద కూర్చుంది. కొద్ది క్షణాల్లోనే ఆమెను పాములు కాటేశాయి. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.

ఇంతలో కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి నుండి వారు ఇంటికి తిరిగి వచ్చినా కూడా ఆ రెండు పాములు ఆ గదిలోనే ఉన్నాయి. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు ఆ రెండు పాములను కొట్టి చంపేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.