సితారకు ముచ్చట్లు చెబుతోన్న సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు.. ఫోటో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 9:02 AM GMT
సితారకు ముచ్చట్లు చెబుతోన్న సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు.. ఫోటో వైరల్‌

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి లాక్‌డౌన్‌ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. పిల్లలు గౌతమ్‌, సితారతో కలిసి మహేష్ చేసే అల్లరిని మహేష్‌ భార్య నమత్ర సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు.

శనివారం మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నమత్ర ఆదివారం మరో ఫోటోను అభిమానులతో పంచుకుంది నమ్రత. సితార ట్యాబ్‌లో ఏదో చూస్తుండగా ఆమెతో మహేశ్ మాట్లాడుతున్నట్లు ఇందులో ఉంది. 'గాడ్జెట్ సమయం ముగిసింది..' అంటూ నమత్ర ఆ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోకు అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.

మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. మనదేశంలోని బ్యాకింగ్‌ వ్యవస్థలోని లోపాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోసర్‌ అభిమానులను ఆకట్టుకుంది.

Next Story