Fact Check : సింగపూర్ లో మాస్క్ వేసుకోలేదని మహిళను అరెస్ట్ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 2:13 PM IST
Fact Check : సింగపూర్ లో మాస్క్ వేసుకోలేదని మహిళను అరెస్ట్ చేశారా..?

కరోనా విపరీతంగా ప్రబలుతున్న సమయంలో మాస్కు వేసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తూ ఉన్నాయి. చాలా దేశాలలో మాస్కు వేసుకోకుండా ఉంటే భారీగా ఫైన్లను విధిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మాస్కు వేసుకోవాలని చెబుతూ ఉన్నారు.

సింగపూర్ లో మాస్కు వేసుకోలేదని మహిళను అరెస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పబ్లిక్ ప్రదేశంలో ఆమె మాస్కు లేకుండా తిరుగుతూ ఉండడం ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

“In Singapore, if no mask, straight arrest. No sympathy.” అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. సింగపూర్ లో మాస్కు లేకుండా ఉన్నందుకు అరెస్టు చేశారు.. ఎటువంటి దయాదాక్షిణ్యాలు పోలీసులు చూపించలేదు అంటూ ట్వీట్లు వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా మంది ఆ వీడియోను షేర్ చేశారు. ఓ మహిళను అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది చుట్టుముట్టి కొద్దిసేపు మాట్లాడారు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న బ్యాగును తీసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. పబ్లిక్ ప్లేస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న మహిళ ముఖానికి మాస్క్ లేదు.

నిజ నిర్ధారణ:

మాస్కు వేసుకోలేదని అధికారులు అదుపులోకి తీసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ ఈ ఘటనపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా... Asia One లో ఈ ఘటనకు సంబంధించిన కథనం దొరికింది. “A woman was arrested at Novena Square on Tuesday afternoon (Oct. 13) after allegedly pouring a bowl of soup on a stranger, biting him and spitting at him, the police confirmed to AsiaOne.” నొవీనా స్క్వేర్ లో ఓ మహిళను అక్టోబర్ 13 మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మీద ఆమె సూప్ బౌల్ ను విసిరికొట్టింది, అతడిని కొరకడమే కాకుండా ఉమ్మి వేసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపు లోకి తీసుకున్నారు అని కథనాల ద్వారా తెలియజేశారు.

The Independent లో కూడా ఈ ఘటన గురించి కథనాన్ని ప్రచురించారు. రెస్టారెంట్ లో ఓ వ్యక్తి మీద ఆమె కావాలనే సూప్ ను పడేసిందని చెప్పుకొచ్చారు. ఆమెను అరెస్టు చేసిన వీడియోలను యుట్యూబ్ లో కూడా పెట్టారు.

S1

సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్ సైట్ లో మాస్కు వేసుకోకుండా ఉంటే 'అరెస్ట్' చేయడం అన్నది శిక్షగా తెలుపుతూ ఎటువంటి నిబంధనలను చెప్పలేదు. మొదటి సారి మాస్కు లేకుండా కనిపించిన వారికి 300 డాలర్ల ఫైన్ విధిస్తామని తెలిపింది. అదే ఎక్కువ సార్లు మాస్క్ పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఇంకా ఎక్కువ ఫైన్లను విధిస్తామని స్పష్టం చేసింది.

S2

సింగపూర్ లో మాస్కు పెట్టుకోలేదని మహిళను అరెస్టు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : సింగపూర్ లో మాస్క్ వేసుకోలేదని మహిళను అరెస్ట్ చేశారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story