నా బొమ్మ బాగుందా..? అంటోన్న రివాల్వర్ రాణి.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jan 2020 5:29 PM ISTదీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అన్నారు పెద్దలు. ఈ నానుడి పెద్దలు ఎవరి మేలు కోరడం కొరకు అన్నారో కానీ సినీతారలు మాత్రం ఇందుకు భిన్నం. ఇండస్ట్రీలో కథానాయికగా అవకాశం వచ్చినప్పుడే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక హీరోయిన్‌గా అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారు ఇండస్ట్రీలో ఉన్నారు.
అయితే.. ఇప్పటి హీరోయిన్లు మాత్రం కేవలం నటనతోనే కాకుండా అందాల ఆరబోతకు సై అంటూ తమ అందాలను కుర్రకారుకు ఎర వేస్తున్నారు. అయితే కొంతమంది భామలు ఎంత అందాలు చూపినా వారికి మాత్రం అదృష్టం అస్సలు కలిసిరాదు. అలాంటి కోవలో ముందువరసలో ఉండే భామ శ్రద్ధా దాస్.
ఈ అమ్మడు.. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లయినా.. కాల కలిసిరాక కేవలం వ్యాంప్ పాత్రలకే పరిమితం అయ్యింది. ఆర్య-2, గుంటూరు టాకీస్ వంటి సినిమాలోనూ అలాంటి తరహా పాత్రలే దక్కడంతో దొరికిన ప్రతి ఛాన్స్‌ను ఆరబోతకే వాడేసుకుంది ఈ అమ్మడు. అందుకే అనుకుంటా.. ఆమె ఎన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు. దీంతో వచ్చిన సినిమా అవకాశాలు చేస్తూనే అడపాదడపపా హాట్ హాట్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇక ఈ భామ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వివిధ యాంగిల్స్‌ను ఆవిష్కరించేందుకు ఫేస్‌బుక్‌లో ఓ ఫోస్టు చేసింది ఈ అమ్మడు. కొన్ని ఫొటోలను తీసుకుని ఆయా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాల్లో తన గెటప్స్‌ను సూచిస్తూ ఆ ఫోస్టు చేసింది. ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్, ఇన్‌స్టాగ్రామ్, టిండర్ తదితర ఫ్లాట్‌ఫామ్‌లను సూచిస్తూ శ్రద్దా తన ఫొటోలను తీసుకుని ఒక్కో ఫ్లాట్‌ఫామ్‌కు అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్ గేమ్స్ పేరిట టాగ్ జతచేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఫోస్టులో అన్ని గుణాలు కలిగిన సంపన్నురాలి(ఆల్‌రౌండర్)ని.. వీటిలో మీకు ఏ మూడ్ నచ్చిందో చెప్పండంటూ నెటిజన్లను కోరింది. ఇక ఆ అమ్మడి పోస్టుకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.