భార‌త సాయాన్ని కోరిన పాకిస్థాన్ పేస‌ర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2020 7:45 AM GMT
భార‌త సాయాన్ని కోరిన పాకిస్థాన్ పేస‌ర్‌

క‌రోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే చాలా దేశాలు లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌జ‌లు ఇళ్లకే ప‌రిమితం అయ్యారు. చాప కింద నీరులా ఈ వైర‌స్ రోజు రోజుకు విజృభిస్తోంది. ఇక పాకిస్థాన్‌లో కూడా క‌రోనా ప్ర‌ళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో భార‌త సాయం చేయాల‌ని కోరాడు ఆదేశ మాజీ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌. పాకిస్థాన్‌లో వెంటిలేట‌ర్ల కొర‌త ఉంది. ఈ క్లిష్ట స‌మ‌యంలో వెంటీలేట‌ర్లు ఇచ్చి భార‌త్ త‌మ దేశాన్ని ఆదుకోవాల‌ని కోరాడు ఈ రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్. భార‌త్ ఈ సాయాన్ని చేస్తే పాకిస్థాన్ ఎప్ప‌టికి గుర్తుపెట్టుకుంటుంద‌న్నాడు.

పాకిస్థాన్‌లో ప్ర‌స్తుతం 4 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఆ దేశంలో వెంటిలేట‌ర్ల కొర‌త తీవ్రంగా ఉంది. షోయ‌బ్ దీనిపై ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడాడు. భార‌త్ 10వేల వెంటిలేటర్లు ఇస్తే.. ఆ సాయాన్ని ఎన్న‌టికి గుర్తుంచుకుంటామ‌న్నాడు. అయితే.. తాము కేవ‌లం మ్యాచ్‌ల గురించి మాత్ర‌మే మాట్లాడే హ‌క్కు ఉంద‌ని, మిగ‌తాదంతా అధికారుల చేతుల్లో ఉంద‌న్నాడు. క‌రోనా క‌ట్ట‌డికి అక్త‌ర్‌ త‌న ఛారిటీ ద్వారా సాయం చేస్తున్నాడు.

Next Story