ముంబై: ఏళ్ల తరబడి కొనసాగుతున్న అయోధ్య వివాదంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందర మందిర్‌.. తర్వాత సర్కార్‌.! అయోధ్యలో మందిరం.. మహారాష్ట్రాలో సర్కార్‌ అంటూ ట్వీట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా నడుస్తున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చే విధంగా పరిస్థితులు లేవు. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఐదేళ్ల పదవీ కాలాన్ని చెరి సగం చేసుకుందామన్న శివసేన ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎవరి ప్రయాత్నాల్లో వారు మునిగిపోయారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోవడం, ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో ‘మహాసంక్షోభం’ ఎప్పుడూ ముగుస్తుందోనని మహారాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. శనివారంతో అసెంబ్లీకి గడువు తీరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని మహారాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.