ప్రైవేటు స్కూల్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన హీరో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sept 2020 2:25 PM IST
ప్రైవేటు స్కూల్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన హీరో

ప్రైవేటు స్కూల్‌పై మానవహక్కుల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు బిగ్‌బాస్‌ సీజ‌న్-1 విన్న‌ర్,‌ సినీ హీరో శివబాలాజీ స‌తీమ‌ణి స్వ‌ప్న మాధురి(మ‌ధుమిత‌). తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్‌లైన్ క్లాస్ నుండి తొలగించడంపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు హీరో శివబాలాజీ దంప‌తులు. ఈ మేర‌కు మౌంట్ లిటేరా జీ స్కూల్ ఫిర్యాదు చేశారు.

ఈ సంద‌ర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ.. పిల్లలపై ఆన్లైన్ క్లాస్ ల పేరుతో అనేక సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నార‌ని ఆరోపించారు. అలాగే.. ఫీజులు వసూలు చేయ‌డం కోసం అనవసరమైన‌ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నార‌ని శివ‌బాలాజీ అన్నారు. ఈ విష‌య‌మై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారని.. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తున్నార‌ని వాపోయారు.

Next Story