గోల్డ్ స్మగ్లర్ తెలివికి అవాక్కయిన అధికారులు
By రాణి Published on 17 March 2020 1:28 PM GMTసాధారణంగా ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులు వివిధ రకాలుగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ..ఒక్కోసారి ఎయిర్ పోర్టు చెకింగ్ లో దొరికిపోతారు. తలపై ఉండే విగ్ లోపల, పళ్లలో, చేతుల్లో ఇన్ బిల్ట్ చేయించుకోవడం. దుస్తుల్లో పెట్టుకోవడం ఇలా చాలా రకాలుగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చాలా మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. కానీ..ఈ స్మగ్లర్ చాలా తెలివిగా లగేజీ బ్యాగుకుండే జిప్ పుల్లర్ లో పెట్టుకొచ్చాడు. శంషాబాద్ లో కరోనా ప్రభావంతో ఇప్పుడు పెద్దగా రద్దీ లేకపోయినప్పటికీ..విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి మాత్రం ఎక్కువగానే ఉంది. కరోనా వైరస్ ఎక్కువగా విదేశాల నుంచి వచ్చేవారికే ఉండటంతో ఎయిర్ పోర్టులో ధర్మల్ స్ర్కీనింగ్ టెస్టులు చేశాక గానీ పంపడం లేదు అధికారులు.
Also Read : కూతురిని వేధించిన వాడికి దేహశుద్ది చేసిన తల్లి..
అలా సోమవారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచీ G9 458 బోయింగ్ విమానం ల్యాండ్ అయింది. అందరూ ప్రయాణికులకు టెస్టులు చేశారు. వారిలోనే ఉన్నాడీ స్మగ్లర్. ఎయిర్ పోర్ట్ లోకి ఎంటరయ్యాక చెకింగ్స్ చేశారు. లగేజీ మొత్తాన్ని స్కానింగ్ మిషన్ లో పెట్టాడు. సెక్యూరిటీ కూడా అతడిని చెక్ చేసింది. కరోనా లక్షణాలు కూడా లేకపోవడంతో..ఇక వెళ్లచ్చని అధికారులు చెప్పారు. దాదాపు ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లిపోయాక అక్కడున్న ఒక అధికారికి అనుమానం వచ్చింది. అతడి లగేజీ బ్యాగ్ కు ఉన్న జిప్ పుల్లర్లలో ఒక జిప్ మాత్రమే మెరుస్తోంది. అనుమానం వచ్చిన అధికారి అతడిని ఆపండంటూ సిబ్బందిని పంపించాడు.
Also Read : వైద్యుడి తప్పిదం..కన్నుమూసిన పసిప్రాణం..అపాయంలో మరో ప్రాణం
అతని దగ్గరకు వచ్చిన అధికారులు పక్కకు తీసుకెళ్లి చెక్ చేయడంతో..అది బంగారంతో తయారు చేసిన జిప్ పుల్లర్. అదొక్కటే కాదు..ఆ లగేజీకున్న అన్ని కూడా బంగారంతో తయారు చేసిన జిప్ పుల్లర్లే. వాటిపై సిల్వర్ కోటింగ్ వేయడంతో గుర్తించలేకపోయిన అధికారులు..ఆఖరిలో అనుమానం రావడంతో పట్టుకోగలిగారు. అతని దగ్గర రెండు ఐ ఫోన్లను కూడా చూశారు. ఇవేంటి అని చెక్ చేస్తే... వాటిలోనూ బంగారం ఉన్నట్లు అర్థమైంది. అతని నుంచీ మొత్తం 133.5 గ్రాముల స్మగ్లింగ్ గోల్డును కస్టమ్స్ యాక్ట్ కింద సీజ్ చేశారు. మొత్తం స్మగ్లింగ్ విలువ రూ.5.50 లక్షలుగా తేల్చారు. ఆ స్మగ్లర్ తెలివి తేటలను చూసి అధికారులు అవాక్కయినంత పనైంది.