కూతురిని వేధించిన వాడికి దేహశుద్ది చేసిన తల్లి..

By రాణి  Published on  17 March 2020 1:03 PM GMT
కూతురిని వేధించిన వాడికి దేహశుద్ది చేసిన తల్లి..

అసలే కలికాలం. అందులోనూ ఈ కాలంలో ఆడపిల్లలు బయటికెళ్తే అసలు రక్షణ లేకుండా పోయింది. అది పట్టణమా..పల్లె అన్నది విషయం కాదు. పూర్వకాలంలో ఆడవాళ్లు గడపదాటి బయటికి వచ్చేవాళ్లు కాదని వింటుండేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆడపిల్ల గుమ్మందాటి స్కూల్ కో, కాలేజీ కో, ఆఫీస్ కో వెళ్లిందంటే తిరిగి ఇంటికొచ్చేంతవరకూ నమ్మకం లేదు. కొంతమంది ఆడపిల్లలు తమకు జరిగే అన్యాయాలను స్వయంగా తామే ఎదుర్కొంటుండగా..మరికొంతమంది తల్లిదండ్రులకు చెప్పడమో..కేసులు పెట్టడమో చేస్తున్నారు.

Also Read : వైద్యుడి తప్పిదం..కన్నుమూసిన పసిప్రాణం..అపాయంలో మరో ప్రాణం

తాజాగా..పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కూతురిని వేధించిన ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసింది తల్లి. పేరుపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ స్థానికంగా ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అతడు 10వ తరగతి చదువుతున్న యువతిపై కన్నేశాడు. రోజూ ఆమె స్కూల్ కు వెళ్లే సమయంలో వేధిస్తుండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా..వేధింపులు ఎక్కువవ్వడంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లికి చెప్పి కన్నీమున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ ఆటో డ్రైవర్ ను పట్టుకుని స్కూల్లోని తరగతి గదిలోనే చెప్పుతో ఎడా పెడా వాయించేసింది. విద్యార్థులు, టీచర్లు చూస్తుండగానే.. చెప్పుతో చితకబాదింది. చెంప దెబ్బలు కొట్టి..చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో వచ్చిన పోలీసులు అతడిని పీఎస్ కు తీసుకెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :నాకు మరణశిక్ష రద్దు చేయండి : నిర్భయ దోషి పిటిషన్

Next Story
Share it