షూటింగ్‌లో స్టార్ హీరోకు గాయాలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Jan 2020 4:16 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కొద్ది రోజుల క్రితం.. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో హిట్ అందుకున్న షాహిద్ మరో తెలుగు రిమేక్‌లో నటిస్తున్నాడు. నానీ హీరోగా నటించిన ‘జెర్సీ’ రీమేక్‌కు ఓకే చెప్పాడు. తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే.. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా శుక్రవారం ఛంఢీగఢ్‌లోని మొహాలీ క్రికెట్ స్టేడియంలో షాహిద్ కపూర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని పెదవికి బంతి బలంగా తగిలింది. దీంతో షాహిద్ కింది పెదవి చిట్లిపోయి రక్తం కారింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతనికి కుట్లు వేసి చికిత్సను అందించారు.
దీంతో.. గాయం తీవ్రత తగ్గే వరకు కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకునేందుకు షాహిద్, తన భార్య మీరా రాజ్‌పుత్ నేడు ముంబైకి తిరిగి పయనమయ్యారు. షాహిద్ గాయం కనపడకుండా మొహానికి మాస్క్‌ను ధరించాడు. తమ హీరోకు గాయమైందని తెలిసిన అభిమానులు షాహిద్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇదిలావుంటే షాహిద్ గాయంతో ‘జెర్సీ’ షూటింగ్‌కు బ్రేక్ పడింది.