అనసూయ కొత్తగా ఏం చూపిస్తోందో..?

By అంజి  Published on  11 Jan 2020 1:10 PM GMT
అనసూయ కొత్తగా ఏం చూపిస్తోందో..?

బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి మంచి డిమాండ్ సంపాదించింది హాట్ యాంకర్ అనసూయ. ముఖ్యంగా 'రంగస్థలం' సినిమా తరువాత నుండి వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ హాట్ బ్యూటీ. అయితే రంగస్థలం సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా అమ్మడు మాత్రం ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, తనకంటూ ప్రత్యేకత కథలో ప్రాధాన్యం కలిగి ఉన్న పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోంది. అలా ఒప్పుకున్న సినిమానే కృష్ణవంశీ 'రంగమార్తాండ'. ఈ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. తన ఫేవరెట్ దర్శకుడు కృష్ణవంశీ నుండి పవర్ ఫుల్ ఆఫర్ అందుకున్న అనసూయ ఆయన చెప్పిన పాత్ర కథలో కీలకంగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసింది.

 Anchor Anasuya

కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే.. నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా నటించబోతుంది. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ రొమాంటిక్ సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట. మరి ఎప్పుడూ రొమాంటిక్ గానే కనిపించే అనసూయ ఇక కొత్తగా రొమాన్స్ ఏం చూపిస్తోందో..? ఇక ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి రమ్యకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ చిత్రాన్ని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా 'కృష్ణ వంశీ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేక చతికిల పడుతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.

 Anchor Anasuya

Next Story