మందు దొరక్క ఏడుగురు ఆత్మహత్య
By అంజి Published on 30 March 2020 10:39 AM ISTహైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ఫూల్, వైన్‌షాపులతో పాటు అన్ని మూసివేశారు. కరోనా కోసం విధించిన లాక్‌డౌన్ ప్రభావం ఎక్కువగా మద్యం ప్రియులపై చూపుతున్నట్లు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో వైన్ షాపులు మూసివేయడంతో మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. కొందరు మతిస్థిమితం కొల్పోతుంటే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చుక్క దొరక్క మందుబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కర్నాటకలో మద్యం దొరక్క ఆరుగురు తమ ప్రాణాలను తీసుకున్నారు. గడిచిన శని, ఆది వారాల్లో నలుగురు మందుబాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేరళలో ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రాంబాబు అనే వ్యక్తి మద్యం లభించకపోవడంతో కత్తితో పీక కొసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్‌పూర్‌కు చెందిన దాసరి వెంకటయ్య తాగడానికి కల్లు దొరక్క పోవడంతో మతిస్థిమితం కోల్పోయి మృతి చెందాడు.
మద్యం లభించకపోవడంతో చాలా మంది మందు ప్రియులు మానసిక వేదనకు గురవుతున్నారు.
ఈనెల 22వ తేదీ నుంచి మద్యం దొరక్కపోవడంతో మద్యం ప్రియులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మద్యం బ్లాక్‌లో దొరుకుతుందేమోనని సందుగొంతులు వెతుకుతున్నారు. కాస్త ఎక్కువ రేటైనా తీసుకుందామంటే దొరకని పరిస్థితి నెలకొంది. ‘కేసీఆర్ సార్ వైన్స్ షాపులు తెరిపించండి’ అంటూ వేడుకుంటున్నారు. రోజుకు కొన్ని గంటలైనా సరే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఎవరికి తోచిన విధంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 29 తేదీ అంటే ఆదివారం రోజు వైన్స్ షాపులు తెరుస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు తెరిచి ఉంటాయని, అలాగే ప్రతి వైన్స్ షాపు వద్ద ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉండి పరిస్థితిని సమీక్షించాలి. మద్యం షాపునకు వచ్చే వ్యక్తుల మధ్యం దూరం ఉండేలా చూడాలి.. అని సారాంశం ఉన్న ఓ జీవో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.