సన్ రైజర్స్ ను ఊరిస్తున్న సెంటిమెంట్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Sept 2020 12:41 PM ISTఈ ఏడాది సన్ రైజర్స్ మొదటి రెండు మ్యాచ్ లలోనూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే..! మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో చేజేతులా ఓడిపోగా.. రెండో మ్యాచ్ లో మాత్రం సరైన ఫినిషర్లు లేక, వేగంగా ఆడే వాళ్లు లేక ఓటమిపాలైంది. అయితే ఇలా ఓడిపోయినా కూడా సన్ రైజర్స్ టైటిల్ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు అభిమానులు. అందుకు కారణం సెంటిమెంట్ అనే చెబుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటిసారిగా ఐపీఎల్ గెలిచినప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయిందని అభిమానులు చెబుతున్నారు.
2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పెద్దగా అంచనాలు లేకుండా టైటిల్ ను సాధించింది. ఆ సీజన్‌లో వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేర్చగా.. ఫైనల్ లో కూడా సన్‌రైజర్స్ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకంది.
2016 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోయిందట..! అది కూడా ఆర్‌సీబీ, కేకేఆర్‌తోనే కావడం గమనార్హం. ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, సన్‌రైజర్స్ హైదరాబాద్ 2020లో కూడా టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్ లో సెంటిమెంట్ వర్కౌట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఈసారి కూడా అదే విధంగా సన్ రైజర్స్ కు సెంటిమెంట్ కలిసొచ్చేనేమో చూడాలి..!
2016 సీజన్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది సన్‌రైజర్స్. ఆ ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాలను సాధించింది. లీగ్ దశ ముగిసే సమయానికి మొత్తంగా 8 మ్యాచ్‌లు విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించి క్వాలిఫయర్-2లోకి అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. టైటిల్ పోరులో ఆర్సీబీపై 8 పరుగుల తేడాతో టైటిల్ గెలిచింది హైదరాబాద్.