'ఆ చిన్నారి మాట‌లు వినండి'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2020 8:28 AM GMT
ఆ చిన్నారి మాట‌లు వినండి

క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి పై క్రీడా ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహాన క‌ల్పిస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే సెహ్వాగ్ తాజాగా క‌రోనా పై అవ‌గాహాన క‌లిగించేలా ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఇది కరోనా వైరస్‌పై సెహ్వాగ్‌ మాట్లాడిన వీడియో కాదు.. ఒక బుడతడు తన బుజ్జి బుజ్జి మాటలతో ఏం చేయాలో తెలియజేశాడు. ఈ వీడియో సెహ్వాగ్‌ కంటబడటంతో దాన్ని తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

‘ ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైనది. చిన్న పిల్లాడు ఎంతో అందంగా కరోనా వైరస్‌ నియంత్రణ గురించి వివరించాడు. ద‌య‌చేసి అత‌ని మాట‌లు వినండి.. ఆ సూచ‌న‌లు త‌ప్ప‌కుండా పాటించండి అని ఆ వీడియో కింద సెహ్వాగ్ రాసుకొచ్చాడు. మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు ర‌క్ష‌ణ క‌వ‌చాలు ధ‌రించాల‌ని, త‌రుచూ చేతుల‌ను శుభ్రం చేసుకోవాల‌ని, ఇంట్లోనే ఉండాల‌ని చిన్నారి ఆ వీడియోలో తెలిపాడు.,

భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత క్రీడాకారులకు కూడా ఉందని మోదీ సూచించిన సంగ‌తి తెలిసిందే. అంతకుముందుగానే మోదీ పిలుపు మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగమయ్యానని సెహ్వాగ్‌ తెలిపాడు.



Next Story