మీరు రిటైర్‌మెంట్ ఇస్తే.. అదే జ‌ట్టుకు గొప్ప సాయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2020 4:37 PM GMT
మీరు రిటైర్‌మెంట్ ఇస్తే.. అదే జ‌ట్టుకు గొప్ప సాయం

పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ ర‌మీజ్ రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆదేశ సీనియ‌ర్ క్రికెట‌ర్లు రిటైర్‌మెంట్ ఇవ్వ‌డ‌మే ఆజ‌ట్టుకు చేసే గొప్ప సాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.,

పాకిస్థాన్ చీఫ్ కోచ్, సెలక్టర్‌గా ఆ జ‌ట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ క్రికెటర్లు మాలిక్, హఫీజ్, ఉమర్ అక్మల్ వంటి క్రికెట‌ర్ల‌కు టీ20 క్రికెట్‌లో అవ‌కాశాలిచ్చాడు. అయినా.. వీరు ఆశించినంత మేర రాణించ‌లేదు. దీంతో.. యువ క్రికెటర్లకి ఛాన్స్‌లివ్వడం ద్వారా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు జ‌ట్టును సిద్ధం చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యోచిస్తోంది.

ఇదిలా ఉంటే.. పాక్ టీ20 జట్టులోకి ఇటీవ‌లే.. రీఎంట్రీ ఇచ్చారు 38 ఏళ్ల షోయ‌బ్ మాలిక్‌, 39 ఏళ్ల హ‌ఫీజ్‌. వీరు అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌ని అనుకుంటున్నారు. కానీ అంత‌క‌న్నా ముందే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌ని చెప్పుకొచ్చాడు ర‌మీజ్ రాజా

‘‘మాలిక్, హఫీజ్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే..? టీమ్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్లతో కలిసి జట్టుని సిద్ధం చేసుకునే వెసులబాటు ఉంటుంది. సుదీర్ఘకాలం ఈ ఇద్దరు క్రికెటర్లు పాక్ టీమ్‌కి మెరుగైన సేవలు అందించారనే విషయం నాకు తెలుసు. కానీ.. గౌరవంగా వీడ్కోలు చెప్పేందుకు వారికి ఇదే తగిన సమయమని నా భావన. ఒకవేళ వాళ్లు ఇప్పుడే వీడ్కోలు చెప్తే.. అది పాక్ టీమ్‌కి ఉపయోగపడనుంది’’ అని రమీజ్ రాజా అన్నాడు.

Next Story
Share it