పఠాన్ బ్రదర్స్ భారీ సాయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2020 12:57 PM GMT
పఠాన్ బ్రదర్స్ భారీ సాయం

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వణికిస్తోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న అభాగ్యుల‌ను ఆదుకునేందుకు ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ (ఇర్ఫాన్‌, యూసుఫ్ )ముందుకొచ్చారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించేందుకు నిరుపేద ప్రజలకు మాస్క్‌లను పంచిన ఈ స్టార్ క్రికెటర్స్.. తాజాగా ఆకలితో అలమటిస్తున్న పేదల కడుపు నింపి తమ పెద్ద మనసు చాటుకున్నారు.

క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడనీ జీవులు.. యాచకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బతుకు దెరువు కోసం నగరాలకు వచ్చిన కూలీల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. దీంతో ఈ మాజీ టిమిండియా ఆట‌గాళ్లు ఏకంగా పదివేల కేజీల బియ్యాన్ని, 700 కేజీల ఆలుగడ్డ(బంగాళదుంప)లను పంచి అభాగ్యుల ఆకలి తీర్చారు.

క‌రోనా వైర‌స్‌పై ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటానికి స‌హ‌క‌రించాల‌ని భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే సెలబ్రిటీలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. క్రీడాలోకం కూడా తమ సాయాన్ని ప్రకటించింది. విరాట్ కోహ్లీ దంపతులు రూ.3 కోట్లు, సచిన్, గంగూలీ రూ.50 లక్షలు, రోహిత్ శర్మ 80 లక్షలు, యువరాజ్ 50 లక్షలు ల‌తో పాటు చాలా మంది త‌మ‌కు తోచిన విధంగా సాయం చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story