భార్య‌ను కొట్టిన డివిలియ‌ర్స్‌.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2020 1:47 PM GMT
భార్య‌ను కొట్టిన డివిలియ‌ర్స్‌.. ఎందుకంటే..?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి క్రీడా టోర్నీలు ర‌ద్దు అయ్యారు. దీంతో త‌మ‌కు దొరికిన ఈ విరామాన్ని క్రీడాకారులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా గ‌డుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొంద‌రు క్రికెట‌ర్లు బోర్‌గా ఫీల‌వుతున్నారు. లాక్‌డౌన్‌తో క‌నీసం ప్రాక్టీస్ చేసుకునే అవ‌కాశం కూడా లేకుండా పోయింది. ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్, మిస్ట‌ర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియ‌ర్స్ కి చేయ‌డానికి ప‌ని లేక బోర్ కొడుతుంద‌ట‌. ఇంట్లోని ఫోర్ మీద ప‌డుకుని బంత‌ని తీసుకుని పైన సీలింగ్‌కు కొడుతూ.. క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. దీన్ని అంత‌టిని అత‌ని భార్య వీడియో తీస్తుండ‌గా.. డివిలియర్స్‌ అదేపనిగా సీలింగ్‌కు బంతిని కొడుతూ తిరిగి వచ్చిన ఆ బంతిని క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే చివరగా ఆ బంతితోనే వీడియో తీస్తున్న తన భార్యను కొట్టాడు. క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేసే క్రమంలో బంతిని పట్టుకుని భార్యపైకి విసిరాడు. ఈ ఘటనకు డివిలియర్స్‌ భార్య ఒక్కసారిగా కంగారు పడింది.

ఈ వీడియో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు ఈ మిస్ట‌ర్ 360 డిగ్రీస్‌. ఆ వీడియోను త‌న భార్య నుంచి దొంగిలించాన‌ని పేర్కొన్నాడు. 'నాకు చిన్నతనం నుంచి ఇలా చేయడం అలవాటు. నేను దీన్ని గంటలు తరబడి చేయగలను. నేను అదే పనిలో ఉండగా నా భార్య వీడియో తీసింది. ఈ వీడియో క్రెడిట్‌ అంతా ఆమెదే. కానీ దాన్ని దొంగిలించి నేను కూడా సర్‌ప్రైజ్‌ ఇచ్చా' అని డివిలియర్స్‌ రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

Next Story
Share it