హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ఆకతాయి వ్యక్తి 100 డయల్‌కు చేసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేసన్‌లో బాంబు ఉందంటూ ఫోన్‌లో హల్ చల్‌ చేశాడు. అప్రమత్తమైన జీఆర్‌పీ పోలీసులు, గోపాలపురం పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అన్ని ప్లాట్ ఫామ్‌లతో పాటు.. స్టేషన్‌లో నిలిచి ఉన్న రైళ్లను కూడా తనిఖీ చేశారు. చివరికి ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు.

బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఫేక్‌ కాల్‌గా గుర్తించిన పోలీసులు.. కాల్‌ చేసిన వ్యక్తి కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఫోన్‌ నెంబర్‌ ద్వారా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ మధ్య కాలంలో ఆకతాయిలు చేస్తున్న ఫేక్‌ కాల్స్‌తో పోలీసులు తల పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విజయవాడ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబ్ బెదిరింపు కాల్‌ వచ్చిన విషయం తెలిసిందే. అది మరువక ముందు ఇప్పుడు మరోసారి బాంబ్‌ బెదిరింపు కాల్‌ రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.