హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వేన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో రెండో రోజు వరల్డ్‌ డిజైన్‌ కాంగ్రెస్‌ సదస్సు జరుగుతోంది. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీవో), తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రముఖ డిజైనర్లు, ప్రతినిధులు, మంత్రులు కేటీఆర్‌, అజయ్‌, ఐటీ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. మొదటిసారి వరల్డ్‌ డిజైన్‌ కాంగ్రెస్‌ సదస్సు హైదరాబాద్‌లో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించినందుకు వరల్డ్‌ డిజైన్‌ కాంగ్రెస్‌ నిర్వహకులకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో అనేక ఐటీ కంపెనీలు పెట్టబడులు పెడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story