Fact Check : తాజాగా తెలుగును రెండో ఉత్తమ లిపిగా గుర్తించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 July 2020 12:45 PM IST
Fact Check : తాజాగా తెలుగును రెండో ఉత్తమ లిపిగా గుర్తించారా..?

ద్రావిడ భాషల్లో తెలుగును ఎక్కువగా మాట్లాడతారనేది తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార భాషగా గుర్తింపు పొందింది. ఇతర దేశాల్లో కూడా తెలుగు భాషను బాగా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. తెలుగు అక్షరాలకు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ రెండో ఉత్తమ లిపిగా తెలుగును గుర్తించారు అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలియజేయాల్సిందిగా న్యూస్ మీటర్ ను కొందరు నెటిజెన్స్ కోరారు.

నిజ నిర్ధారణ:

ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగును రెండో ఉత్తమ లిపిగా గుర్తించిందన్నది 'నిజమే'

‘International Alphabet Association Telugu’ అనే కీ వర్డ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ నిర్వహించిన వరల్డ్ ఆల్ఫాబెట్ ఒలింపిక్స్ లో రెండో అత్యుత్తమ లిపిగా అవార్డును అందుకున్న వార్తా కథనాలు ఎన్నో లభించాయి. ఈ అవార్డు ఈ మధ్య కాలంలో వచ్చిన అవార్డు కాదు. 2012 లో వచ్చిన అవార్డు. వైరల్ అవుతున్న ఫోటో కొన్ని సంవత్సరాలుగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తూనే ఉంది.

ఐ.టి.ఎస్.సి.ఏ. (ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్) బ్లాగ్ ప్రకారం, ఉత్తమ లిపి ఏదన్న విషయంపై కొన్నాళ్ల నుండి చర్చ జరుగుతూ ఉండగా.. అక్టోబర్ 2009 లో 16 దేశాలకు చెందిన లిపిలకు సంబంధించి ఓ కాంపిటీషన్ పెట్టాలని అనుకున్నారు. పలువురు ప్రముఖులు, పండితులు, ప్రభుత్వాలు ఈ పోటీని నిర్వహించాలని అనుకున్నాయి. అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 4, 2012 లో ఈ కాంపిటీషన్ ను నిర్వహించారు. హంగుల్ (Hangeul) కొరియన్ లిపికి గోల్డ్ మెడల్ రాగా.. దక్షిణ భారతదేశానికి చెందిన తెలుగు భాష రెండో స్థానంలో నిలవగా, ఇంగ్లీష్ మూడవ స్థానం దక్కించుకుంది.

అప్పటి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ను ఇక్కడ చూడొచ్చు:

2

ఈ న్యూస్ ను పలు కొరియన్ వెబ్ సైట్లు ప్రచురించాయి:

http://world.kbs.co.kr/service/news_view.htm?lang=e&Seq_Code=93727

https://www.koreabang.com/2012/stories/korean-script-wins-controversial-alphabet-olympics.html

ఈ వార్తను ఇక్కడ కూడా పబ్లిష్ చేశారు:

Language Log published by the University of Pennsylvania on October 16, 2012

ఈ కాంపిటీషన్ తర్వాత మరోసారి వరల్డ్ ఆల్ఫాబెట్ ఒలింపిక్స్ ను నిర్వహించారన్న వార్తలు కూడా లభించలేదు. తెలుగును రెండో ఉత్తమ లిపిగా గుర్తించారన్నది థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ లో 2012 లో నిర్వహించిన వరల్డ్ ఆల్ఫాబెట్ ఒలింపిక్స్ అప్పటిది.

ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ కు చెందిన వెబ్ సైట్ ను చూడగా ఎటువంటి సమాచారం లభించలేదు.

https://www.internationalphoneticassociation.org/

ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగును రెండో ఉత్తమ లిపిగా గుర్తించిందన్నది 'నిజమే'. కానీ ఇది ఈ మధ్య నిర్వహించిన పోటీలోనిది కాదు. 2012 లో నిర్వహించిన ఈవెంట్ కు చెందినది.

Next Story