కరోనా వైరస్ ఎక్కించుకుంటే రూ.3లక్షలు
By తోట వంశీ కుమార్ Published on 11 March 2020 8:01 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ధాటికి ఇప్పటికే 3వేల మందికి పైగా మృత్యువాత పడ్డాడు. వేలసంఖ్యలో వైరస్ బాధితులు ఉన్నారు. దాదాపు 100కు పైగా దేశాల్లో కరోనా విజృభిస్తోంది. కాగా ఇప్పటి వరకు ఈ వైరస్‌కు మందును కనిపెట్టలేదు. ఈ వైరస్‌ను మందును కనిపెట్టడానికి అనేక దేశాలకు చెందిన సైంటీస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. లండన్ శాస్త్రవేత్తలు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ వైరస్‌ను ఎక్కించుకుంటే రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించారు. ప్రకటన ఇవ్వడమే ఆలస్యం.. ఈ వైరస్ ఎక్కించుకునేందుకు సిద్దం అంటూ చాలా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట.
కరోనా వైరస్ చైనాలో కాస్త తగ్గు ముఖం పట్టినా.. ఇటలీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి 60కు పైగా మంది మృతిచెందారు. మరోవైపు భారత్‌లో కూడా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. నెల్లూరులో ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు పరిశోధనల్లో మునిగితేలుతున్నారు.
ప్రస్తుతం లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సైంటిస్టులంతా ఎంతో కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో లండన్ సైంటిస్టులు ఓ ఆఫర్ ప్రకటించారు. కరోనా జాతికి చెందిన ఓసీ43, 229ఈ వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా ఈ వైరస్ శరీరంలోకి ఎక్కించుకుంటే... వారికి రూ. 3 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.
కాగా.. ఈ ఆఫర్‌కు ఎవరు ముందుకు రారని చాలా మంది భావించారు. అయితే వారి అంచనాలను తలకింద్రులు చేస్తూ ఈ ప్రకటనకు చాలా మంది నుంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు చాలామంది వైరస్‌ను ఎక్కించుకునేందుకు తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నట్లు సమాచారం. తమ పరిశోధనల కోసం ఆరోగ్యంగా ఉన్న వారిని పలు బ్యాచులుగా విభజించి.. వారికి ఈ కరోనా వైరస్‌లను ఎక్కించి, పరిశోధనలు జరుపుతారు సైంటిస్టులు. ఈ వైరస్‌లు ఎవరైనా తమ శరీరంలోకి ఎక్కించుకుంటే కాస్త శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి తప్ప ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమి లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.