కరోనాను జయించిన 100ఏళ్ల వృద్ధుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 12:21 PM GMT
కరోనాను జయించిన 100ఏళ్ల వృద్ధుడు

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచాన్నే వణిస్తోంది. ఈ వైరస్‌ బారీన పడి 3వేల మందికి పైగా మృత్యువాత పడగా.. వేలసంఖ్యలో వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే 100ఏళ్ల వృద్దుడు ఈ వైరస్‌ను జయించాడు. అది కూడా వైరస్‌ ఎక్కువగా ఉన్న చైనాలో. దీంతో కరోనాను జయించిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

ఫిబ్రవరి 24న కరోనా వైరస్‌ లక్షణాలతో 100ఏళ్లు దాటిన ఓ వ్యక్తి మెటర్నిటీ అండ్‌ చైల్డ్ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం అతనికి కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శ్వాససంబంధ సమస్యలు, అల్జీమర్స్‌, గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స మరింత కష్టంగా మారింది. బందువులు ఇక ఆ వృద్దుడు బతకడం కష్టం అని భావించారు. అయినా.. డాక్టర్లు, ఆ వృద్దుడు ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. యాంటీబయోటిక్స్‌, సంప్రదాయ చైనా మందులతో చికిత్స చేశారు. కాగా 13 రోజుల అనంతరం కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేయడంతో హాయిగా తన ఇంటికి వెళ్లిపోయాడు.

Next Story