భరోసా ఇస్తున్న వాట్సాప్

WhatsApp Says Privacy Policy Update Doesn't Affect Privacy Of Your Messages. వాట్సాప్ ఇటీవల తమ ప్రైవసీ నిబంధనలలో చాలా మార్పులను తీసుకుని వచ్చింది. వీటి వలన ఎటువంటి ఇబ్బంది లేదు అని భరోసా ఇస్తున్న వాట్సాప్.

By Medi Samrat  Published on  12 Jan 2021 4:59 PM IST
WhatsApp Privacy Policy

వాట్సాప్ ఇటీవల తమ ప్రైవసీ నిబంధనలలో చాలా మార్పులను తీసుకుని వచ్చింది. ఈ ప్రైవసీ నిబంధనల కారణంగా ఎంతో డేటా వాట్సాప్ చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పడంతో తీవ్ర విమర్శలు రాగా.. ఆ విషయంలో ప్రజలకు క్లారిటీ ఫేస్ బుక్ సంస్థ భావించింది. ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్సాప్, ఈ మేరకు అన్ని ప్రైవేటు మెసేజ్ లూ 100 శాతం సురక్షితంగా ఉంటాయని తెలిపింది.

ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ట్వీట్ చేసింది. బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారంపైనే పాలసీ నిబంధనల ప్రభావం ఉంటుందని తెలిపింది. బంధుమిత్రులు, స్నేహితులకు పంపే సమాచారం పూర్తి రహస్యమని.. వాట్సాప్ ద్వారా పంపే సమాచారాన్ని ఫేస్ బుక్ తో కూడా పంచుకోబోమని.. ఎవరి ప్రైవేటు మెసేజ్ లను తాము చూడబోమని తెలిపింది. కాల్స్ ను కూడా వినబోమని తెలిపింది. కేవలం కాల్ లాగ్స్ ను మాత్రం దాచి వుంచుతామని తెలిపింది.

తమ మాధ్యమం ద్వారా లోకేషన్ షేర్ చేసినా, ఆ వివరాలను చూడబోమని.. ఫేస్ బుక్ కు ఇవ్వబోమని ఇప్పుడు చెబుతోంది వాట్సాప్ సంస్థ. కాంటాక్టుల వివరాలను కూడా ఎవరితోనూ పంచుకోబోమని.. ఫేస్ బుక్ యాజమాన్యం కింద ఉన్నప్పటికీ వాట్సాప్ గ్రూప్ ప్రైవేటు సంస్థగానే వ్యవహరిస్తుందని తెలిపింది. యూజర్లు అవసరమనుకుంటే, తమ మెసేజ్ లను నియమిత సమయం తరువాత డిలీట్ చేసే ఆప్షన్ పెట్టుకోవచ్చని సూచించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను తిరిగి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని అంటోంది.


Next Story