షాకిచ్చిన వాట్సాప్.. 18 లక్షల ఖాతాలు బ్యాన్
WhatsApp bans 18 lakh Indian accounts in March.ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్‌ఫోన్ ఉంటోంది. ఇక ఫోన్‌లో
By తోట వంశీ కుమార్ Published on 3 May 2022 11:20 AM ISTప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్‌ఫోన్ ఉంటోంది. ఇక ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్స్‌లో వాటాప్స్ ఒకటి. దీని ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి ఎంతో సులభంగా షేర్ చేయవచ్చు. అయితే.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై వాట్సాప్ కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్లను బ్యాన్ చేస్తోంది. 2022 మార్చిలో భారత్‌కు చెందిన 18.05లక్షల ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ ప్రకటించింది.
వాట్సాప్‌ను దుర్వినియోగం చేసినట్టు తమ సొంత మెకానిజమ్ గుర్తించిన ఖాతాలతో పాటు యూజర్ల నుంచి ఫిర్యాదులను ఎదుర్కొన్న అకౌంట్లు బ్యాన్ అయిన వాటిలో ఉన్నట్లు వాట్సాప్ తెలిపింది. మార్చిలో 597 భారత అకౌంట్లపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 74 మందిపై చర్యలు తీసుకున్నామని కంపెనీ నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ ఖాతాలు చట్టం, నిబంధనలను ఉల్లంఘించాయని వాట్సప్ చెప్పింది. గతేడాది అమలులోకి వచ్చిన కొత్త ఐటీ చట్టం ప్రకారం ఈ చర్య తీసుకోవడం జరిగిందని తెలిపింది.
ప్లాట్‌ఫామ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు మెటా సంస్థకు చెందిన వాట్సాప్ చర్యలు చేపట్టింది. దుర్వినియోగం చేసే వారిని పలు రకాలుగా గుర్తిస్తోంది. ప్రత్యేకమైన టూల్స్‌తో పాటు వివిధ వనరులను కూడా ఇందుకోసం వినియోగిస్తోంది. అలాగే రిపోర్ట్ ఫీచర్ ద్వారా యూజర్లు ఎవరి ఖాతాపైన అయినా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఇక ఫిబ్రవరి నెలలో 14 లక్షల ఖాతాలను నిషేదించిన సంగతి తెలిసిందే.