వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు అంతరాయం

Virgin Galactic flight DELAYED by tropical storm as crew get ready to make history. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష

By Medi Samrat
Published on : 11 July 2021 7:31 PM IST

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు అంతరాయం

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు అంతరాయం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం) ఈ రోదసి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ యాత్ర ప్రారంభానికి వేదికగా నిలిచే న్యూ మెక్సికోలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని వర్జిన్ గెలాక్టిక్ వర్గాలు వెల్లడించాయి. దాంతో అంతరిక్ష యానం 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుందని తెలిపాయి. వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న ఈ రోదసి యాత్ర కోసం యూనిటీ 22 వ్యోమనౌకను ఉపయోగిస్తున్నారు. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములు ప్రయాణించనున్నారు.

యూనిటీ 22 వ్యోమనౌకతో కూడిన వాహకనౌక నింగికి త్వరలోనే ఎగరనుంది. దీంట్లో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్ (70) తో పాటు నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తున్నారు. వారిలో భారత సంతతి తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అరుదైన రోదసియాత్ర చేపడుతున్నారు. దీన్ని లైవ్ లో తిలకించేందుకు వర్జిన్ గెలాక్టిక్ ఏర్పాట్లు చేసింది. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

2016 లో, దివంగత ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ వర్జిన్ గెలాక్టిక్ యొక్క రెండవ స్పేస్ షిప్ టూ క్రాఫ్ట్(Virgin Galactic's second SpaceShipTwo craft) ను విఎస్ఎస్ యూనిటీ అని పిలిచారు. మొదటి స్పేస్ షిప్ టూ క్రాఫ్ట్ విఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ 2014 లో పరీక్షల సమయంలో క్రాష్ అయింది. వర్జిన్ గెలాక్టిక్ బ్లూ ఆరిజిన్ మరియు ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల నుండి ప్రైవేట్ స్పేస్ రేస్‌లో తీవ్రమైన పోటీ ఉంది.


Next Story