'బర్డ్ వాచ్' తో ట్విట్టర్ లో తప్పుడు వార్తలకు చెక్

Twitter Birdwatch. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంటుంటాయి. కొన్ని క్షణాల్లో అవి వైరల్

By Medi Samrat  Published on  7 Jun 2021 12:35 PM IST
బర్డ్ వాచ్ తో ట్విట్టర్ లో తప్పుడు వార్తలకు చెక్
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంటుంటాయి. కొన్ని క్షణాల్లో అవి వైరల్ అయిపోయి ఎన్నో రకాల ఘటనలకు కారణం అవుతూ ఉంటాయి. అందుకే సోషల్ మీడియా దిగ్గజాలు ఎప్పటికప్పుడు తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా కీలక మార్పులు చేస్తూ ఉంటారు.


తాజాగా ట్విట్ట‌ర్ కూడా ఫేక్ న్యూస్ ను కట్టడి చేసేందుకు 'బర్డ్ వాచ్' అనే కొత్త టూల్‌ను తీసుకువచ్చింది. ప్ర‌స్తుతం ఈ కొత్త ఫీచ‌ర్‌ను డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ వినియోగదారుల్లో కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా యూజ‌ర్లు త‌మ‌కు అనుమానున్న ట్వీట్ల‌ను మార్క్ చేసి.. అందుకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించవచ్చు. స‌ద‌రు ట్వీట్ తప్పు అనే విషయంపై సర్వే జరగనుంది. ట్వీట్ లో ఉన్న సమాచారం ఫేక్ అని తెలిస్తే వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరో వైపు భారత్ లో ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో వివాదం నడుస్తూ ఉంది. పలువురు ప్రముఖులకు బ్లూ టిక్ తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం ట్విట్టర్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ చట్టం నిబంధనల ప్రకారం భారతీయుడిని గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. భారత ఐటీ మినిస్ట్రీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదే చివరి నోటీసని కూడా హెచ్చరించింది.


Next Story