స‌రికొత్త ఫీచర్లతో 'ట్రూ కాలర్'

Truecaller Unveils Exciting Product Roadmap for Android users. ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్

By Medi Samrat  Published on  1 Jun 2022 12:42 PM GMT
స‌రికొత్త ఫీచర్లతో ట్రూ కాలర్

ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకుని రావడానికి సిద్ధంగా ఉంది. కొత్త ఫీచర్లలో వీఓఐపీ కాలింగ్ కోసం వాయిస్ కాల్ లాంచర్, ఎస్ఎంఎస్ ఇన్‌బాక్స్ కోసం పాస్‌కోడ్ లాక్, మెరుగైన కాల్ లాగ్‌లు, సింప్లిఫైడ్ ఇన్‌స్టంట్ కాల్ రీజన్, వీడియో కాలర్ ఐడీ కోసం ఫేస్ ఫిల్టర్‌లు, ఏఐ స్మార్ట్ అసిస్టెంట్ ఉండనున్నాయి. ఈ ఫీచర్లన్నీ వినియోగదారులను సురక్షితమైన, అవాంతరాలు లేని సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను అనుభవించేలా చేస్తాయి.

తీసుకురాబోతున్న ఫీచర్ల గురించి ట్రూకాలర్ ఇండియా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్‌జున్‌వాలా మాట్లాడుతూ "మా వినియోగదారుల నుండి తీసుకుంటున్న ఫీడ్‌బ్యాక్ లు మాకు ఎంతో సహాయపడుతూ ఉన్నాయి. ఎల్లప్పుడూ కొత్త ఆవిష్కరణలు, మెరుగైన సేవలను అందించడంలో మాకు సహాయపడుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఆండ్రాయిడ్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందిస్తున్నాము. ఈ ఫీచర్లు సమర్థవంతమైన, సురక్షితమైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడమే కాకుండా వినియోగదారులకు వారి కమ్యూనికేషన్, డేటాపై ఎక్కువ నియంత్రణను అందించగలవు.

ట్రూకాలర్ నుండి వస్తున్న ఫీచర్లు :

వాయిస్ కాల్ లాంచర్: వాయిస్ కాల్ లాంచర్ అనేది ట్రూకాలర్ వాయిస్‌లో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్న మీ కాంటాక్ట్ లను కనుగొనడానికి సులభమైన మార్గం. ఒక ట్యాప్‌తో, మీరు మీ ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వవచ్చు. ఉచిత, హై డెఫినిషన్, వీఓఐపీ ఆధారిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

ఎస్ఎంఎస్ కోసం పాస్‌కోడ్ లాక్ - టెక్స్ట్ మెసేజీల గోప్యతను నిర్ధారించుకోవచ్చు. మీ మొబైల్ బయోమెట్రిక్ లేదా వేలిముద్ర ప్రమాణీకరణకు మద్దతు ఇస్తే, మీరు దానిని కూడా ఉపయోగించగలరు. సమాచారం రహస్యంగా ఉంచుకోవచ్చు.

మెరుగైన కాల్ లాగ్‌లు - ట్రూకాలర్ గత వెర్షన్‌లోని 1000 ఎంట్రీలతో పోలిస్తే కొత్త వాటిలో 6400 ఎంట్రీలను ఎనేబుల్, సపోర్ట్ చేసే కాల్ లాగ్‌లను ఆప్టిమైజ్ చేసింది.

మెరుగైన కాల్ రీజన్ - మీరు మీ కాల్‌ని లిఫ్ట్ చేయకపోయినా, అప్పటికీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, వెంటనే కాల్ రీజనింగ్ ను పంపడానికి ట్రూకాలర్ మిమ్మల్ని అనుమతిస్తుంది

వీడియో కాలర్ ఐడీ కోసం ఫేస్ ఫిల్టర్‌లు - కాలింగ్ అనుభవాన్ని మరింత ఉత్తేజకరమైన రీతిలో మార్చడానికి, ప్రత్యేకమైన కాలింగ్ అనుభవాన్ని సృష్టించే లక్ష్యంతో అంతర్నిర్మిత టెంప్లేట్‌లను జోడించింది. సెల్ఫీ, VR పవర్డ్ ఫిల్టర్‌లు మరింత సృజనాత్మకంగా ఉండటానికి సహాయ పడతాయి. అద్భుతమైన ఫేస్ ఫిల్టర్‌ల శ్రేణితో వీడియో కాలర్ IDని ఎలివేట్ చేసే అవకాశాన్ని అందిస్తాయి.Next Story