గ్రహాంతర వాసులు.. అంతమయ్యారట..!
There Used to Be Aliens in Our Galaxy, but They Killed Themselves Off. గ్రహాంతర వాసులు.. ఈ టాపిక్ మీద తీవ్రమైన చర్చ ఎప్పటి
By Medi Samrat
గ్రహాంతర వాసులు.. ఈ టాపిక్ మీద తీవ్రమైన చర్చ ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు సమాధానం దొరికినట్లే మనకు అనిపించినా.. కానీ అది అర్థం కాని అంశమే..! అప్పుడప్పుడు మనకు వస్తున్న సిగ్నల్స్ ఈ విశ్వంలో మనం ఒక్కళ్ళమే కాదనే విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. గ్రహాంతర వాసులను గుర్తించేందుకు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనంలో గ్రహాంతరవాసులు ఉండేవారు కానీ.. వాళ్ల టెక్నాలజీనే వారిని అంతమొందించిందని తెలుస్తోంది.
పాలపుంతలోని నక్షత్రమండలంలో ఏలియన్స్ ఉండేవారని, అయితే వారంతా అంతరించిపోయి ఉండొచ్చట. వారు అంతరించిపోవడానికి కారణం టెక్నాలజీనే అని అంటున్నారండోయ్..!
అమెరికాలోని కాల్టెక్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు తెలిసి వచ్చాయి. దాదాపు 800 కోట్ల ఏళ్ల కిందట గెలాక్సీలో ఏలియన్స్ పుట్టి ఉంటారని.. శాస్త్ర సాంకేతికతలో పురోగతి సాధించే కొద్దీ ఎన్నో నాగరితకలు అంతరించిపోయాయని అన్నారు. ఏలియన్స్ కూడా అలాగే అంతరించిపోయి ఉంటారని అంటున్నారు. శాస్త్ర సాంకేతికతలే మనిషి వినాశనానికి, జీవుల అంతానికి కారణమవుతాయని 1961లో హోయర్నర్ సిద్ధాంతం చెబుతోంది. 1966లో సాగన్, స్క్లోవ్ స్కీ కూడా అదే చెప్పారు. ఏలియన్స్ విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని అసలు గ్రహాంతరవాసులు లేనే లేరా అంటే ఉండొచ్చని చెబుతూ ఉన్నారు. భూమికి చాలా దూరంగా వారు ఉన్నారని చెబుతున్నారు.