ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం ఎంతవరకు అంటే?

Solar Eclipse 2020. అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి.

By Medi Samrat  Published on  14 Dec 2020 8:04 AM GMT
ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం ఎంతవరకు అంటే?

అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ తరుణంలోనే ఈ రోజు కూడా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డురావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచితే సంపూర్ణ సూర్య గ్రహణం అని అంటారు. అంతేకాకుండా కొంతవరకు మాత్రమే అడ్డుగా ఉంటే దాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. ఇంకా అమావాస్య రోజు సూర్య గ్రహణం, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

అయితే ప్రతినెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యలలో ఈ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడవు. గ్రహాలన్నీ వరుస క్రమంలో ఏర్పడినప్పుడు ఈ సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతాయి. అయితే ఈ ఏడాదిలో ఆరు గ్రహణాలు ఉండగా అందులో ఇదే చివరి గ్రహణం. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం సోమవారం రాత్రి 7:03 గంటల నుంచి అర్ధరాత్రి 12:23 దాకా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికా వంటి దేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ముఖ్యంగా చిలీ, అర్జెంటీనా వంటి దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం భారతదేశంలో లేనందు వల్ల దేవాలయాలలో యధావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తంలో ఆరు గ్రహణాలు ఉండగా వాటిలో నాలుగు చంద్ర గ్రహణాలు రెండు సూర్య గ్రహణాలు ఏర్పడ్డాయ్. అయితే ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం.


Next Story