రాకెట్ వేగంతో పెరుగుతున్న 5G వినియోగదారుల సంఖ్య..!

2030 నాటికి భారతదేశంలో 5G సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 97 కోట్లకు చేరుతుందని.. ఇది మొత్తం మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో 74 శాతంగా ఉంటుందని టెలికాం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ మంగళవారం తెలిపింది.

By Medi Samrat  Published on  26 Nov 2024 9:30 PM IST
రాకెట్ వేగంతో పెరుగుతున్న 5G వినియోగదారుల సంఖ్య..!

2030 నాటికి భారతదేశంలో 5G సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 97 కోట్లకు చేరుతుందని.. ఇది మొత్తం మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో 74 శాతంగా ఉంటుందని టెలికాం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ మంగళవారం తెలిపింది. ఎరిక్సన్ కన్స్యూమర్‌ల్యాబ్ పరిశోధన నివేదిక ప్రకారం.. 2024 చివరి నాటికి భారతదేశంలో 5G సబ్‌స్క్రైబర్ల సంఖ్య 27 కోట్లకు మించి ఉంటుందని.. ఇది దేశంలోని మొత్తం మొబైల్ వినియోగదారులలో 23 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఇది కాకుండా భారతదేశంలో ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు సగటు నెలవారీ డేటా వినియోగం ప్రస్తుతం 32 GB ఉంది.. ఇది 2030 నాటికి 66 GBకి పెరుగుతుందని అంచనా.

2024 చివరి నాటికి గ్లోబల్ 5G వినియోగదారులు దాదాపు 2.3 బిలియన్లుగా ఉంటారని.. ఇది మొత్తం మొబైల్ వినియోదారులలో 25 శాతం ఉంటుందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో 2030 నాటికి 5G కస్టమర్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 6.3 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం.. Gen AI యాప్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో పెరుగుతుందని అంచనా. భారతదేశంలోని 5G స్మార్ట్‌ఫోన్ యజమానుల్లో 67 శాతం మంది వచ్చే ఐదేళ్లలో Gen AI యాప్‌లను ఉపయోగించడం ప్రారంభిస్తారు.

5G నెట్‌వర్క్‌ల కోసం మూడు రకాల బ్యాండ్‌లు ఉపయోగించబడతాయి. ఇవి మూడు - తక్కువ, మధ్య, అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు. మొదటి ఫ్రీక్వెన్సీ 1GHz కంటే తక్కువగా ఉంటుంది. ఈ బ్యాండ్ ఎక్కువ కవరేజీని అందిస్తుంది కానీ వేగం తక్కువగానే ఉంటుంది. మధ్య బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 1GHz నుండి 6GHz. ఈ బ్యాండ్‌లో కవరేజ్, వేగం రెండూ సమతుల్యంగా ఉంటాయి. హై బ్యాండ్ గురించి మాట్లాడితే.. దీని ఫ్రీక్వెన్సీ 24GHz నుండి 40GHz వరకు ఉంటుంది. ఇది ఎక్కువ వేగాన్ని అందిస్తుంది.. కానీ తక్కువ కవరేజీని అందిస్తుంది.

దేశంలో 5G సేవల‌ కోసం 12 ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను వేలంలో ఉంచారు. వేలంలో వివిధ టెలికాం కంపెనీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ యొక్క 5G సేవలు పని చేస్తున్నాయి.

Next Story