వచ్చేస్తున్న Moto G పవర్ (2022) స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఏమిటంటే..?
Moto G Power (2022) with Helio G37 SoC, 5000mAh battery launched. మోటోరోలా వరుసగా గ్యాడ్జెట్స్ ను రిలీజ్ చేసుకుంటూ వెళుతోంది. Moto Watch 100ని
By Medi Samrat Published on 23 Nov 2021 8:45 PM ISTమోటోరోలా వరుసగా గ్యాడ్జెట్స్ ను రిలీజ్ చేసుకుంటూ వెళుతోంది. Moto Watch 100ని ఆవిష్కరించిన తర్వాత, Motorola సంస్థ ఇప్పుడు Moto G పవర్ (2022)ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2021లో ప్రారంభించబడిన Moto G పవర్‌కి కొనసాగింపుగా వస్తోంది. Moto G పవర్ ను వచ్చే ఏడాదిలో భారత్ మార్కెట్ లోకి వదిలే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. Moto G పవర్ క్యాప్సూల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు పెద్ద సెన్సార్లు ఉన్నాయి. డిస్ప్లే మూలల చుట్టూ సన్నని బెజెల్‌లను కలిగి ఉంది. డిస్ప్లేలో పంచ్-హోల్ కెమెరా ఉంది. వెనుక ప్యానెల్ పై M లోగో ఉంది, ఇది ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌గా పని చేయనుంది.
Moto G పవర్: ధర మరియు లభ్యత :
Moto G పవర్ అమెరికాలో 4GB+64GB వేరియంట్ కోసం $199 (దాదాపు రూ. 14,000) ధరతో ప్రారంభించబడింది. స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM మరియు 128GB వేరియంట్‌తో వచ్చే మరొక వేరియంట్ కూడా ఉంది. దీని ధర 249 డాలర్లు అని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఒకే డార్క్ గ్రోవ్ కలర్ వేరియంట్‌లో అందించబడింది. మోటరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు.
ప్రత్యేకతలు :
Moto G Power (2022) 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో పంచ్ హోల్ కటౌట్‌ను ఉంచారు. 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో జత చేయబడిన MediaTek Helio G37 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్ పవర్ చేయబడింది, మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. కెమెరా పరంగా Moto G పవర్ 2022 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 2MP మాక్రో షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 5,000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది.