హిందూపురం, మదనపల్లె, ప్రొద్దుటూరు, మంచిర్యాలలో 5జీ సేవలు

Jio Extends 5G Network to 10 Cities Across 8 States. రిలయన్స్ జియో మంగళవారం తన ట్రూ 5G సేవలను ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ

By Medi Samrat  Published on  7 Feb 2023 7:45 PM IST
హిందూపురం, మదనపల్లె, ప్రొద్దుటూరు, మంచిర్యాలలో 5జీ సేవలు

రిలయన్స్ జియో మంగళవారం తన ట్రూ 5G సేవలను ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 10 నగరాల్లో సేవలను ప్రారంభించింది. రిలయన్స్ సంస్థ 5జీ సేవలను అందిస్తున్న మొత్తం నగరాల సంఖ్య 236కి చేరుకుంది.మంగళవారం విడుదల చేసిన జియో ప్రకటన ప్రకారం.. ఈ నగరాల్లోని జియో వినియోగదారులు 1Gbps వేగంతో అపరిమిత డేటాను పొందనున్నారు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Jio వెల్‌కమ్ ఆఫర్‌ అందుబాటులో ఉంది. జియో ప్రతినిధి మాట్లాడుతూ ఎనిమిది రాష్ట్రాల్లోని 10 నగరాల్లో జియో ట్రూ 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడం మాకు గర్వకారణంగా ఉందని అన్నారు. 236 నగరాల్లోని జియో వినియోగదారులు జియో ట్రూ 5G ప్రయోజనాలను ఆస్వాదించవచ్చని తెలిపారు.

జియో సంస్థ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం, మదనపల్లె, ప్రొద్దుటూరు నగరాల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్; ఒడిశాలో తాల్చేర్; పంజాబ్‌లోని పాటియాలా; రాజస్థాన్‌లోని అల్వార్; తెలంగాణలో మంచిర్యాల; ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో నేటి నుండి Jio 5G సేవలను ఆనందించనున్నాయి. ఈ ప్రాంతాలను డిజిటలైజ్ చేయాలనే మా తపనకు నిరంతరం మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జియో ప్రతినిధి చెప్పారు.


Next Story