థ్రెడ్స్ తెగిపోయేలా ఉన్నాయి..!

Instagram's Threads is losing active users. ట్విట్టర్‌కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ కు కాలం కలిసిరావడం లేదు.

By Medi Samrat  Published on  28 July 2023 2:59 PM GMT
థ్రెడ్స్ తెగిపోయేలా ఉన్నాయి..!

ట్విట్టర్‌కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ కు కాలం కలిసిరావడం లేదు. కేవలం 5 రోజుల్లోనే 100 మిలియన్ల డౌన్‌లోడ్లు సాధించిన మొదటి యాప్‌గా రికార్డ్‌ సృష్టించినా.. ఎందుకో సంథింగ్ మిస్సింగ్ అనే ఫీల్ కు వచ్చేశారు యూజర్లు. మొదటి వారం రోజులు బాగా సందడి చేసింది. కానీ ఇప్పుడు అనుకున్నట్లుగా యాక్టివిటీలు లేకుండా పోయాయి. సుమారుగా సగానికి సగం మందికి పైగా థ్రెడ్స్ యాప్‌ని వీడారు. ఇక మెటా కంపెనీలోని ఉన్నత ఉద్యోగులకు ఈ అంశంపై దృష్టి సారించి వినియోగదారులు యాప్‌పై ఎక్కువ సమయం కేటాయించేలా చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

తాము అనుకున్న దాని కంటే వినియోగదారులు ఎక్కువగానే వచ్చి చేరారని కంపెనీ భావిస్తోంది. యాప్‌ వినియోగదారుల సంఖ్య తగ్గడం సాధారణమే అని మార్క్ జుకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు. యాప్‌లో ఇంకా అవసరమైన ఫీచర్లు జోడిస్తామని అన్నారు. డెస్క్‌టాప్ యాప్‌, యాప్‌లో సెర్చ్ ఫంక్షనాలిటీ తీసుకువస్తే యూజర్లు ఆసక్తి చూపుతారని మెటా యాజమాన్యం భావిస్తోంది.


Next Story