మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ ఈరోజు కాస్త అంతరాయాన్ని ఎదుర్కొంది. చాలా మంది వినియోగదారులు లాగిన్ అవ్వలేకపోయారు. అంతేకాకుండా ఎప్పటిలాగే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించలేకపోయారు. ఇన్‌స్టాగ్రామ్ తమకు పని చేయడం లేదని ఎంతో మంది వినియోగదారులు ట్విట్టర్‌లోకి వెళ్లారు. ఫీడ్‌లు రిఫ్రెష్ చేయలేకపోతున్నామని కొందరు చెప్పగా.. మరికొందరు అసలు యాప్‌లోకి లాగిన్ చేయలేకపోయామన్నారు.
డౌన్‌డిటెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. మే 25, మంగళవారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించినట్లు నివేదించబడింది. దాదాపు మధ్యాహ్నం 12:45 వరకు నిలిచిపోయింది. ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై, బెంగళూరు.. అనేక ఇతర నగరాల నుండి ఇన్‌స్టాగ్రామ్ పని చేయడం లేదని నివేదికలు వచ్చాయి. అయితే కొంతమంది వినియోగదారులు ఆ సమయంలో కూడా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించగలిగారు. చాలా మంది వినియోగదారులు వారి ఖాతాలకు లాగిన్ చేయడంతోపాటు ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని ఫీచర్స్ ను ఉపయోగించగలిగారు.