భారత్‌లో ప్రత్యక్షమైన మిస్టరీ మోనోలిత్ ఏకశిల.. ఏలియన్స్ పనేనా?
India's 1st Monolith Appears With Mysterious Message In Ahmedabad. గత కొన్ని నెలల నుంచి ప్రపంచాన్ని కలవరపెడుతున్న మోనోలిత్ ఏకశిలలు ఒకటి. ఏలియన్స్ పనేనా
By Medi Samrat Published on 1 Jan 2021 6:46 AM GMTగత కొన్ని నెలల నుంచి ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో మోనోలిత్ ఏకశిలలు ఒకటి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇది గ్రహాంతర వాసుల పనే అని చాలా మంది అంటున్నారు. ఈ మోనోలిత్ మిస్టరీ ఏకశిలలకు ఏలియన్స్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నట్టుండి ఎలా ఈ మోనోలిత్ పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు భారతదేశంలో కూడా మిస్టరీ మోనోలిత్ ఏకశిల ప్రత్యక్ష్యమైంది. అహ్మదాబాద్ లోని తల్తెజ్ ప్రాంతంలో సింఫనీ పార్క్ ఉన్నది. ఆ పార్క్ లో మోనోలిత్ ఏకశిల ప్రత్యక్షం అయ్యింది. రాత్రికి రాత్రే కనిపించిన ఈ మోలోలిత్ ఏకశిలతో ప్రజలు షాక్ అయ్యారు. ఇంటికి వెళ్లే సమయంలో ఆ ప్రాంతంలో ఎలాంటి రాయి లేదని.. ఉదయాన్నే వచ్చే సరికి అక్కడో రాయి కనిపించినట్టు అక్కడి ఉద్యోగి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మోనోలిత్ ఏకశిల మూడు వైపులా ఉంటుంది. మెరిసే లోహాపు పలకలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీన్ని మిస్టరీ మోనోలిత్ అని పిలుస్తారు. ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు.
అమెరికాలోని ఉటా నగరంలో మొదటిసారిగా మోనోలిత్ రాయి కనిపించింది. ఆ తరువాత ఇప్పటి వరకు దాదాపు 30 నగరాల్లో కనిపించింది. ఎవరు ఎందుకు పెడుతున్నారో ఇప్పటి వరకు ఇది మిస్టరీగానే ఉండిపోయింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ రాయి కనిపించడంతో దీనిపై ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ రాయి దేనికి చిహ్నం. దీని వలన అనర్ధాలు ఉంటాయా లేదంటే మంచి జరుగుతుందా అని చర్చించుకుంటున్నారు.