ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయేమో.. జర భద్రం

గూగుల్ ప్లే స్టోర్ ఎప్పటికప్పుడు హానికర యాప్స్, లేదా తన పాలసీలను ఉల్లంఘించే యాప్స్‌ను

By Medi Samrat  Published on  21 Aug 2023 2:56 PM GMT
ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయేమో.. జర భద్రం

గూగుల్ ప్లే స్టోర్ ఎప్పటికప్పుడు హానికర యాప్స్, లేదా తన పాలసీలను ఉల్లంఘించే యాప్స్‌ను తొలగిస్తూ ఉంటుంది. యూజర్లకు చెడు చేసే యాప్స్ పై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉంటుంది గూగుల్. తాజాగా 43 యాప్స్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. యూజర్లు తమ ఫోన్లలో ఉన్న ఆ యాప్స్‌ను డిలీట్ చేయాలని కోరింది. ఆ యాప్స్ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను తినేయడంతోపాటు యూజర్ల డేటాను దొంగిలిస్తూ ఉన్నాయి. యూజర్ల స్మార్ట్ ఫోన్లు టర్న్ ఆఫ్ అయినప్పుడు ఆ యాప్‌లు యాడ్స్ లోడ్ చేస్తున్నాయని గూగుల్ గుర్థించింది. ఇది గూగుల్ ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధం కావడంతో ఆ యాప్స్ కు స్థానం లేదని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ యాప్‌లను మొదటగా McAfeeలోని మొబైల్ పరిశోధన బృందం గుర్తించింది, వారు Play Store నియమాలను ఈ యాప్స్ ఉల్లంఘించాయని Googleకి తెలిపారు. చాలా యాప్‌లు అప్పటి నుండి ప్లే స్టోర్ నుండి తీసివేశారు. కొన్ని డెవలపర్‌లు అప్‌డేట్ చేశారు. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లను వెంటనే తొలగించాలని మెకాఫీ కోరుతోంది. తీసివేసిన యాప్‌ల జాబితాలో TV/DMB ప్లేయర్‌లు, మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసే యాప్స్, వార్తలు, క్యాలెండర్ యాప్‌లతో సహా వివిధ రకాలైన యాప్స్ ఉన్నాయి. మీరు మీ Android డివైస్ లలో 43 యాప్‌లలో ఏదైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే, వాటిని వెంటనే తొలగించాలి. మీరు ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసే యాప్‌ల గురించి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. విశ్వసనీయ డెవలపర్‌ల నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.. ఇన్‌స్టాల్ చేసే ముందు పర్మిషన్స్ ను పరిశీలించండి.

Next Story