గూగుల్ ప్లేస్టోర్‌లో విపరీతంగా పడి ఉన్న లోన్స్ అందించే యాప్స్ ను తొలగిస్తోంది గూగుల్. లోన్స్ అందించే 2వేలకుపైగా యాప్స్‌లను తొలగించింది గూగుల్. సమాచారాన్ని తప్పుగా చూపించడం, ఆఫ్‌లైన్‌లో ఈ యాప్స్ పనితీరు కారణంగా వాటిపై చర్యలు చేపట్టినట్లు గూగుల్ తెలిపింది. ఇలాంటి యాప్స్‌పై రానున్న రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది. గూగుల్ సీనియర్ డైరెక్టర్, ఆసియా పసిఫిక్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ హెడ్ సైకత్ మిత్రా మాట్లాడుతూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రాంతాలలో నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉందని చెప్పారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్ మోసాలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నామని.. జనవరి నుండి భారతదేశంలోని ప్లే స్టోర్ నుండి రుణాలు అందించే 2,000 కంటే ఎక్కువ యాప్‌లను తొలగించినట్లు తెలిపారు.
ఈ యాప్‌లు భారతీయ వినియోగదారులను బెదిరింపులకు గురిచేస్తున్నాయని, కాబట్టి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సంప్రదించిన తర్వాత వాటిని తొలగించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు గూగుల్ తెలిపింది. యాప్‌లు అప్‌లోడ్ చేయబడినప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో వాటిని సమీక్షిస్తారని మిత్రా వెల్లడించారు. అయితే లోన్ యాప్‌ల విషయంలో బయట చాలా నేరపూరిత కార్యకలాపాలు కూడా నివేదించబడ్డాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం ధృవీకరించిన యాప్‌లు లేవని మిత్రా తెలిపారు. హానికరంగా కనిపించకపోయినా కొన్ని లోన్ యాప్‌లు వాస్తవానికి.. వినియోగదారులను బెదిరించవచ్చని అభిప్రాయ పడ్డారు.