జీమెయిల్ యూజర్ల ముందు అదిరిపోయే ఫీచర్లు
Gmail will soon let you make voice or video calls to your contacts. జీమెయిల్ యూజర్లకు ముందు అదిరిపోయే ఫీచర్లు వచ్చాయి. జీమెయిల్ మొబైల్ యాప్‌ను
By Medi Samrat Published on 9 Sep 2021 2:29 PM GMT
జీమెయిల్ యూజర్లకు ముందు అదిరిపోయే ఫీచర్లు వచ్చాయి. జీమెయిల్ మొబైల్ యాప్‌ను లేదా వెబ్ యాప్స్‌ను ఉపయోగించి నేరుగా గూగుల్ మీట్ యూజర్లకు వాయిస్, వీడియో కాల్స్‌ను చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ సంస్థ తెలిపింది. జీమెయిల్ యూజర్లు ఒకరికొకరు వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్గించనుంది. భవిష్యత్తులో వాయిస్ ఇంటర్నెట్ ప్రొటోకాల్స్‌ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లలో భాగంగా జీమెయిల్ యాప్స్‌లో చాట్, స్పేసెస్, గూగుల్ మీట్ వంటి మూడు ట్యాబ్‌లను వర్క్‌స్పేస్ టూల్స్‌కు మరింతగా దగ్గరవ్వనున్నాయి.
గూగుల్ మీట్ బటన్‌పై క్లిక్ చేసిన తరువాత జనరేట్ అయిన లింక్‌ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్ చేయవచ్చు. ప్రస్తుతం తెచ్చిన ఫీచర్‌తో నేరుగా జీమెయిల్ ఖాతాతో గూగుల్ మీట్ లో పాల్గొనవచ్చు. ఇక గూగుల్ మీట్ కంపానియన్ మోడ్‌ను నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. గూగుల్ క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్, స్లయిడ్‌లు, మీట్, టాస్క్‌లతో సహా ఇతర గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్ సహకారంతో టీమ్ మీటింగ్‌లకు ఉపయోగపడనుంది. గ్రూప్ చాట్ లాంటి ఫీచర్‌లో భాగంగా పాల్గొనేవారికి డాక్యుమెంట్‌లను షేర్ చేయడానికి సులువుగా ఉండనుంది. యూజర్ల మధ్య జరిగిన కన్వర్‌సేషన్‌ను పూర్తిగా సేవ్ చేసుకోవచ్చని కూడా గూగుల్ చెప్పింది.